Home
Mobile

ధర రూ.13999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే 5G స్మా్ర్ట్‌ఫోన్‌..!

భారత్ మార్కెట్లోకి రియల్‌మి P3 సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా P3 ప్రో 5G, P3X 5G హ్యాండ్‌సెట్‌లు లాంచ్‌ అయ్యాయి. P3x 5X స్మార్ట్‌ఫోన్ రూ.15000 కంటే తక్కువ ధరలో (Realme P3X 5G smartphone Launched) అందుబాటులోకి వచ్చింది. డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటోంది. దీంతోపాటు 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర, సేల్‌ పూర్తి వివరాలు.

రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
రియల్‌మి P3x 5G హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల పుల్ HD+ (1080*2400 పిక్సల్స్‌) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. లూనార్ సిల్వర్‌ కలర్‌ వేరియంట్ ప్రీమియం వేగాన్‌ లెదర్‌ లుక్‌ను కలిగి ఉంటుంది. లైట్‌ ప్రసరించినప్పుడు రంగుల్లో మార్పులను గమనించవచ్చు.

Realme P3X 5G smartphone launch telugu news

చిప్‌సెట్‌, OS :
ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB eMMC 5.1 స్టోరేజీతో జతచేసి ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది.

50MP సోనీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెన్స్‌, IP68+ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ రియల్‌మి P3x 5G హ్యాండ్‌సెట్ 5G, 4G LTE, వైపై, బ్లూటూత్‌, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

Realme P3X 5G smartphone launch telugu news

రియల్‌మి P3X 5G స్మార్ట్‌ఫోన్‌ ధర :
రియల్‌మి P3X 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme P3x 5G sale) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఈ ఫోన్‌ సేల్‌ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానుంది. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ (realme.com), ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ లూనార్ సిల్వర్, స్టెల్లర్‌ పింక్, మిడ్‌నైట్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

* ఈ ఫోన్‌తోపాటు రియల్‌మి P3 ప్రో కూడా లాంచ్‌ అయింది. ప్రో మోడల్‌ 6.83 అంగుళాల 1.5k క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది.

రియల్‌మి P3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 80W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX896 కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ప్రారంభ ధర రూ.23999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P3X 5G smartphone Launched with 6000mAh Battery and 6.7 inch display in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X