రూ.11999 కే వేగాన్ లెదర్ ఫినిష్, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా 5G స్మా్ర్ట్‌ఫోన్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం తొలి భాగంలో రియల్‌మి P3 సిరీస్‌ను లాంచ్ చేసింది. మరియు ఆగస్టు నెలలో రియల్‌మి P4 సిరీస్ ను విడుదల చేసింది. దీంతోపాటు కొన్నిరోజుల ముందు రియల్‌మి P3 లైట్ 5G మోడల్‌ను కూడా తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 50MP కెమెరా, 6000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది.
రూ.2 వేల డిస్కౌంట్ :
భారత్ మార్కెట్‌లో రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ (Realme P3x 5G Smartphone) విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్‌లో భాగంగా రూ.2,000 చొప్పున డిస్కౌంట్‌ను పొందవచ్చు.

అంటే ఈ ఫోన్ 6GB/128GB వేరియంట్ ధర రూ.11999, 8GB/128GB వేరియంట్ ధర రూ.12999 ధరలకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా మరింత తక్కువ ధరకే ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.
రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ వేగాన్ లెదర్ ఫినిష్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

6000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS తో పనిచేస్తోంది. ఈ ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, Wi-Fi 5, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ స్టెల్లర్ పింక్, లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
* రియల్‌మి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ :
ఇటీవల రియల్‌మి నుంచి P3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 తో పనిచేస్తోంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్, 5W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 32MP కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆర్మర్ షెల్ టఫ్ బిల్ట్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫీచర్‌ల కారణంగా 2 మీటర్ల నుంచి ఫోన్ కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశాలు ఉంటాయని రియల్‌మి చెబుతోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10499 గా ఉంది.


Click it and Unblock the Notifications







