Home
Mobile

ధర రూ.12,999 కే వాటర్‌ ప్రూఫ్‌, 6000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లే 5G ఫోన్‌..!

రియల్‌మి P3 సిరీస్ ఇటీవల భారత్‌ మార్కెట్‌ లో లాంచ్‌ అయింది. ఈ సిరీస్‌ లో భాగంగా రియల్‌మి P3 ప్రో 5G, రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. ఇప్పటికే ప్రో మోడల్ సేల్‌ ప్రారంభం అయింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి P3x 5G సేల్‌ (Realme P3x 5G Smartphone Sale) ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది.

ధర వివరాలు :
రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. ఈ ఫోన్‌ స్టెల్లర్‌ పింక్, లూనార్ సిల్వర్, మిడ్‌నైట్‌ బ్లూ కలర్ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంటుంది.

Realme P3x 5G Smartphone sale

డిస్కౌంట్ వివరాలు :
రియల్‌మి వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. అన్ని బ్యాంకుల డెబిట్‌, క్రెడిట్ కార్డులపై రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ల ధరలు రూ.12999, రూ.13999 గా ఉంటాయి. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై 5 శాతం క్యా్ష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1080*2400 పిక్సల్స్‌ ను కలిగి ఉంది. ప్రీమియం వేగాన్ లెదర్‌ డిజైన్‌ తో అందుబాటులో ఉంది. మరియు మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెంట్‌ గా ఉంది.

రెండు కెమెరాలు :
ఈ రియల్‌మి ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ ను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌ తో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. టైమ్‌ల్యాప్స్‌, పనోరమ వంటి అనేక ఫీచర్‌లను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB eMMC 5.1 స్టోరేజీతో జతచేసి ఉంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, WiFi 5, బ్లూటూత్‌ 5.3, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఇప్పటికే రియల్‌మి P3 ప్రో 5G మోడల్‌ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

* రియల్‌మి P3 ప్రో 5G ఫోన్ 6.83 అంగుళాల 1.5k క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది.

ఈ ఫోన్ 50MP సోనీ IMX896 (OIS) ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలతోపాటు 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. AI Best Face, AI Reflection Remover, AI మోషన్‌ డీబ్లర్, AI Erase 2.0 ఫీచర్‌లను కలిగి ఉంది. 80W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P3x 5G Smartphone sale to start from today on flipkart check price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X