Home
Mobile

రేపే రియల్‌మి నుంచి భారీ బ్యాటరీ ఫోన్‌లు విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు!

Realme P4 Series Smartphones Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి రేపు మధ్యాహ్నం 12 గంటలకు (ఆగస్టు 20) రియల్‌మి P4 సిరీస్‌ విడుదల కానుంది. ఇందులో P4 5G, P4 5G Pro స్మార్ట్‌ఫోన్‌ లు లాంచ్‌ కానున్నాయి. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ లకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ 7000mAh భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ల ధర వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది.

రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్‌ ( Realme P4 5G Smartphone ) 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.77 అంగుళాల ఫ్లాట్‌ అమోలెడ్‌ FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌, హైపర్‌ విజన్‌ AI చిప్‌ ను కూడా కలిగి ఉంటుంది. 144FPS BGMI ను సపోర్టు చేస్తుందని రియల్‌మి చెబుతోంది.

realme P4 5G series smartphones telugu news

ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ, 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. IP65 + IP66 రేటింగ్‌ తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటుంది.

రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ ప్రో ( Realme P4 Pro 5G Smartphone ) మోడల్‌ స్మార్ట్‌ఫోన్ 144Hz రీప్రెష్‌ రేట్‌ తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, HDR10+ సపోర్టును కలిగి ఉంటుంది. 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ తో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

realme P4 5G series smartphones telugu news

ఈ ప్రో మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. థర్మల్‌ మేనేజ్‌మెంట్ కోసం 7000 Sq mm ఎయిర్‌ఫ్లో VC కూలింగ్ సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX896 (OIS), 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత UI 6.0 పైన పనిచేస్తుంది. ఈ సిరీస్‌ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుంది. దీంతోపాటు ప్రో మోడల్‌ AI ట్రావెల్‌ స్నాప్‌, AI ల్యాండ్‌స్కేప్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది.

రియల్‌మి P4 5G, రియల్‌మి P4 ప్రో 5G ధర వివరాలు :
రియల్‌మి ప్రొడక్ట్ మార్కెటింగ్‌ హెడ్ X పోస్ట్ ఆధారంగా రియల్‌మి P4 5G స్మార్ట్‌ ఫోన్‌ ప్రారంభ ధర రూ.17499 గా ఉంటుంది. అయితే టిప్‌స్టర్‌ సుదన్షు అంబోర్‌ వివరాల ఆధారంగా ప్రో మోడల్‌ ధర లీక్‌ అయింది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.26999, టాప్‌ ఎండ్‌ వేరియంట్ ధర రూ.28999 గా ఉంటుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme P4 5G series smartphones launching tomorrow in india confirmed features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X