Home
Mobile

7000mAh భారీ బ్యాటరీ, ప్రత్యేక చిప్‌తో రియల్‌మి P4 5G సిరీస్‌ ఫోన్‌లు విడుదల.. ఇవాళ ఎర్లీ బర్డ్ సేల్‌..!

Realme P4 5G Series Launched in india : రియల్‌మి P4 సిరీస్‌ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఇందులో భాగంగా రియల్‌మి P4 5G, రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సిరీస్‌ 7000mAh భారీ బ్యాటరీలను కలిగి ఉంది. గేమింగ్‌ సమయంలో మెరుగైన డిస్‌ప్లే పనితీరు కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చిప్‌సెట్స్‌ను కూడా అమర్చారు. ఈ సిరీస్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర పూర్తి వివరాలు,

* రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్ మరియు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Realme P4 5G Series

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. మరియు హైపర్‌ విజన్‌ చిప్‌ ను కూడా అమర్చి ఉంది. ఈ చిప్‌సెట్‌ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. AI Edit, AI Travel Snap వంటి ఫీచర్లను కలిగి ఉంది.

* రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్‌ 6.8 అంగుళాల ఫుల్‌ HD+ అమోలెడ్ 4D కర్వ్+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 6500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 4320Hz PWM డిమ్మింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 సపోర్టు చేస్తుంది. మరియు Hyper Vision చిప్‌ను కూడా కలిగి ఉంది. గేమ్ ప్లే, ఫ్రేమ్‌ రేట్‌, లైటింగ్‌ను మెరుగుపరుస్తుందని రియల్‌మి చెబుతోంది.

ఈ ఫోన్‌ BGMI 144fps, 1.5K రిజల్యూషన్‌ను సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తుంది. ఈ ప్రో మోడల్‌ ఫోన్‌ మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్ కోసం 7000 sq mm ఎయిర్‌ఫ్లో VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా OIS సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ మరియు 50MP OV50D సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుక, ముందు కెమెరాల ద్వారా 60fps వద్ద 4K వీడియోలను రికార్టు చేయవచ్చు. AI Text Scanner, AI స్నాప్‌ మోడ్‌, AI పార్టీ మోడ్‌, AI Landscape వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్లున్నాయి.

రియల్‌మి P4 5G సిరీస్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 10W రివర్స్‌ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ IP65, IP66 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రిసెస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.4, WiFi 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

* రియల్‌మి P4 5G సిరీస్ ధర, సేల్ వివరాలు :
ఈ సిరీస్ బేస్‌ వేరియంట్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18499 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21499 గా ఉంది.

ఇవాళ (ఆగస్టు 20) సాయంత్రం 6 గంటల నుంచి 10 వరకు Early Bird Sale నిర్వహిస్తున్నట్లు రియల్‌మి తెలిపింది. ఈ ఫోన్ సేల్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు రూ.1000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను కూడా అందిస్తోంది.

రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28999 గా ఉంది.

ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు రూ.2000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు. మూడు నెలల వరకు నోకాస్ట్‌ EMI ఆప్షన్ కూడా ఉంది. ఆగస్టు 27 మధ్యా్హ్నం 12 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

ప్రో మోడల్‌ బ్రీచ్‌ వుడ్‌, డార్క్‌ ఓక్‌, మిడ్‌నైట్‌ ఐవీ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. రియల్‌మి P4, P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్లను రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్, భాగస్వామ్య రిటైల్‌ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P4 5G Series Smartphones with 7000mAh battery and AI features launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X