7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, హైపర్‌విజన్ చిప్‌తో 5G స్మార్ట్‌ఫోన్.. డిస్కౌంట్ ఆఫర్!
రియల్‌మి సంస్థ ఇటీవల అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ముఖ్యంగా P4 సిరీస్ లో భాగంగా గత సంవత్సరం చివర నుంచి వివిధ మోడల్స్ లాంచ్ అయ్యాయి. ప్రస్తుతం రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ (Realme P4 5G Smartphone) రూ.20 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీంతోపాటు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ 50MP కెమెరా, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటుంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల పూర్తి వివరాలు.
ప్రస్తుతం రియల్‌మి P4 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో (Flipkart) అందుబాటులో ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23,999 గా ఉంది. బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

స్పిసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. IP65 + IP66 రేటింగ్ తో డస్ట్, వాటర్ రిసెస్టెంట్ గా ఉంది. 7.58mm థిక్‌నెస్ ను కలిగి ఉంది.
కూలింగ్ సిస్టమ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ను కలిగి ఉంది. దీంతోపాటు రిజల్యూషన్, మెరుగైన ఫ్రేమ్ రేట్ కోసం హైపర్ విజన్ చిప్ ను కూడా అమర్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం VC కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని రియల్‌మి హామీ ఇచ్చింది. ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. 5 సంవత్సరాల వరకు మెరుగైన బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని రియల్‌మి చెబుతోంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. AI Edit, AI Party Mode, AI Text Scanner, AI Travel Snap, ఏఐ ల్యాండ్‌స్కేప్ ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.4, Wi-Fi 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సర్, ఇ-కంపాస్, కలర్ టెంపరేచర్ సెన్సార్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








