ఇవాళ్టి నుంచే రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ సేల్.. 7000mAh బ్యాటరీ, హైపర్ విజన్ చిప్..!
Realme P4 5G Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి ఇటీవల రియల్‌మి P4 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఇందులో భాగంగా రియల్‌మి P4 5G, రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. బేస్ వేరియంట్ ఎర్లీ బర్డ్ సేల్ ఆగస్టు 20 వ తేదీ సాయంత్రం 6 - 10 గంటల వరకు నిర్వహించారు. అయితే ఈ ఫోన్ సేల్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
ఇక్కడ కొనుగోలు చేయవచ్చు :
రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ సేల్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18499 గా ఉంది.

రూ.2500 డిస్కౌంట్ :
అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.21499 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు రూ.1000 ఎక్స్ఛేంజీ బోనస్‌ను కూడా పొందవచ్చు.
రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP65, IP66 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రిసెస్టెంట్‌గా ఉంది.

మీడియాటెక్ ప్రాసెసర్ :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ హైపర్ విజన్ చిప్‌ను కూడా కలిగి ఉంది. ఈ చిప్ రిజల్యూషన్‌తోపాటు ఫ్రేమ్ రేట్‌ను మెరుగుపరుస్తుందని రియల్‌మి చెబుతోంది. అయితే ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
7000mAh భారీ బ్యాటరీ :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తుంది. మరియు ఈ ఫోన్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్ ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో AI Edit, AI Travel Snap, ఏఐ ల్యాండ్‌స్కేప్, ఏఐ పార్టీ మోడ్, ఏఐ టెక్ట్స్ స్కానర్ వంటి ఫీచర్లున్నాయి.
కనెక్టివిటీ పరంగా రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.4, WiFi 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








