రియల్‌మి P4 సిరీస్ నుంచి 6300mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు..!
Realme P4 lite 4G Smartphone : రియల్‌మి నుంచి త్వరలో P4 సిరీస్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. రియల్‌మి P4 లైట్ 4G స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 20 వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే P4 సిరీస్ లో అనేక మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే త్వరలో విడుదల కానున్న హ్యాండ్‌సెట్ మెరుగైన బ్యాటరీ లైఫ్, పనితీరుతో బడ్జెట్ ధరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
6300mAh బ్యాటరీ :
రియల్‌మి P4 లైట్ 4G స్మార్ట్‌ఫోన్ 6300mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఛార్జింగ్ సపోర్టు వివరాలు వెల్లడి కాలేదు. ఈ హ్యాండ్‌సెట్ 7.94mm స్లిమ్ ప్రొఫైల్ తో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుందని రియల్‌మి చెబుతోంది.

ప్రాసెసర్ వివరాలు :
ఈ రియల్‌మి ఫోన్ ఆక్టా కోర్ Unisoc T7250 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్ లో మెరుగైన పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. OS సహా ఇతర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దీంతోపాటు సర్కిల్ టు సెర్చ్, నాయిస్ రిడక్షన్ కాల్ 2.0, ఏఐ ఫోటో ఎన్‌హేన్స్‌మెంట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
రియల్‌మి P4 లైట్ 4G స్మార్ట్‌ఫోన్ ఎంత ధర సెగ్మెంట్ లో అందుబాటులో వస్తుందో, ఏ ప్లాట్‌ఫాం ద్వారా సేల్ ప్రారంభం కానుందో వెల్లడి కాలేదు. ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
భారీ బ్యాటరీతో ఇటీవలే రియల్‌మి ఫోన్ :
రియల్‌మి P4 సిరీస్ నుంచి ఇటీవలే P4 పవర్ 5G విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 10,001mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది. 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల 1.5K 4D కర్వ్+ హైపర్ గ్లో డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతోంది. ఈ ఫోన్ 4613 sq mm ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్, హైపర్ విజన్+ AI చిప్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్, 16MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








