Home
Mobile

రూ.7999 ధరకే 6300mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్, HD+ డిస్‌ప్లే తో ఫోన్‌.. ఇవాళ్టి నుంచే సేల్‌!

Realme P4 lite 4G Smartphone Sale : భారత్‌ మార్కెట్‌లో రియల్‌మి నుంచి ఇటీవల P4 సిరీస్‌ ఫోన్‌ లాంచ్‌ అయింది. రియల్‌మి P4 లైట్ 4G పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ సేల్‌ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఎంట్రీ లెవల్‌ ధరలో ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల అయింది. అయినా 6300mAh బ్యాటరీతోపాటు HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది.

రూ.7999 ధరకే :
రియల్‌మి P4 లైట్‌ 4G స్మార్ట్‌ఫోన్ ను రియల్‌మి ఆన్‌లైన్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.9999, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999 గా ఉంది. అయితే తొలి సేల్‌లో భాగంగా రూ.7999, రూ.9999 కే సొంతం చేసుకోవచ్చు.

Realme P4 lite 4G Smartphone sale

HD+ డిస్‌ప్లే, IP54 రేటింగ్‌ :
రియల్‌మి P4 లైట్ 4G స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్, 563 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌, స్ల్పా్ష్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

ఆర్మర్‌ షెల్‌ ప్రొటెక్షన్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్మర్‌ షెల్‌ ప్రొటెక్షన్‌, మిలిటరీ గ్రేడ్ డ్రాప్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని రియల్‌మి తెలిపింది. 1.8 మీటర్ల ఎత్తు నుంచి కిందపడినా డ్యామేజీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతోంది. ఈ ఫోన్‌ పల్స్ లైట్‌ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. 9 రంగులు, 5 కస్టమైజబుల్ గ్లోయింగ్ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది.

Realme P4 lite 4G Smartphone sale

ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్‌ UNISOC T7250 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌ 4GB LPDDR4x ర్యామ్, 128GB స్టోరేజీతో జతచేసి ఉంది. Mail G57 MP1 GPU ను కూడా ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత realme UI 6.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ మైక్రో SD కార్డును సపోర్టు చేస్తుంది. 2TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

భారీ బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా రియల్‌మి P4 లైట్‌ 4G స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు 13MP కెమెరా, ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరా ఉంది. 30fps వద్ద 1080p వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. 15W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6300mAh బ్యాటరీని కలిగి ఉంది.

Realme P4 lite 4G Smartphone sale

ఈ హ్యాండ్‌సెట్ సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది. కనెక్టివిటీ పరంగా 4G LTE, బ్లూటూత్‌ 5.2, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ప్రాక్సిమిటీ సెన్సర్, యాంబియంట్‌ లైట్‌, గైరోస్కోప్, యాక్సెలిరోమీటర్‌ సెన్సార్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ సీ బ్లూ, ఒబ్సిడియన్‌ బ్లాక్, బీచ్‌ గోల్డ్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P4 lite 4G Smartphone with 6300mAh battery sale to start from today on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X