రూ.12999 ధరకే 7000mAh భారీ బ్యాటరీ, 6.8 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 OSతో 5G స్మార్ట్‌ఫోన్
రియల్‌మి P4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ (Realme P4 Lite 5G Launch) భారత్ మార్కెట్లో విడుదల అయింది. గత నెలలో 4G వేరియంట్ ను విడుదల చేసిన రియల్‌మి సంస్థ తాజాగా 5G మోడల్ ను తీసుకొచ్చింది. బడ్జెట్ రేంజ్ లో ఈ హ్యాండ్‌సెట్ ను లాంచ్ చేశారు. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, కూలింగ్ ఛాంబర్ కూడా ఉంది. తొలి సేల్ లో భాగంగా రూ.1500 వరకు తగ్గింపును అందిస్తామని రియల్‌మి తెలిపింది.
రియల్‌మి P4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్ 6.8 అంగుళాల డిస్‌ప్లేతో విడుదల అయింది. 144Hz రీఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది.

ఆండ్రాయిడ్ 16 OS :
ఈ రియల్‌మి ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్ ను కలిగి ఉంది. 6GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది.
ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్, 7000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ ధర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 5300 Sq mm తో ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 15W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ ఆకట్టుకొనే అవకాశం ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 13MP కెమెరాతోపాటు మరో లెన్స్ కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ మొజాయిక్ గ్రీన్, మొజాయిక్ బ్లూ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, వైఫై 5, 3.5mm ఆడియో జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 212 గ్రాముల బరువును ఉంటుంది.
రియల్‌మి P4 లైట్ 5G ధర, సేల్ :
ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15999 గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ మార్చి 25 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్ ల నుంచి కొనుగోలు చేయవచ్చు. తొలి సేల్ లో భాగంగా రూ.1000 డిస్కౌంట్ తోపాటు బ్యాంకు కార్డులపై మరో రూ.500 తగ్గింపును పొందవచ్చు. పరిమితకాల ఆఫర్ మాత్రమేనని రియల్‌మి తెలిపింది.


Click it and Unblock the Notifications








