బడ్జెట్ ధరలో మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 7000mAh భారీ బ్యాటరీ, 144Hz రీఫ్రెష్ రేట్‌తో 5G ఫోన్..!
రియల్‌మి భారత్ మార్కెట్‌లో (Realme India) ఇటీవల అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం జనవరిలో రియల్‌మి 16 సిరీస్ విడుదల చేసింది. అనంతరం జనవరి చివర్లో ఏకంగా 10001mAh భారీ బ్యాటరీతో రియల్‌మి P4 పవర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. అదే బ్యాటరీ సామర్థ్యంతో ఇటీవల రియల్‌మి నార్జో పవర్ 5G ఫోన్‌ను లాంచ్ చేసింది.
గత నెలలో 4G.. ప్రస్తుతం 5G ఫోన్ :
ఈ సంవత్సరం ఫిబ్రవరి రియల్‌మి P4 లైట్ 4G వేరియంట్ విడుదల అయింది. మార్చి నెలలో C85 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యాయి. అయితే త్వరలో రియల్‌మి P4 లైట్ 5G వేరియంట్ (Realme P4 Lite 5G Smartphone) విడుదల కానుంది. తాజాగా విడుదల తేదీ సహా ఇతర స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు రియల్‌మి వెల్లడించింది.

ఎప్పుడు విడుదల కానుంది :
రియల్‌మి P4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో మార్చి 19 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ రూ.15000 ప్రారంభ ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
IP64 రేటింగ్ :
అయితే ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, చిప్ సహా అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. 8.4mm థిక్‌నెస్ ను కలిగి ఉంటుంది. మొజాయిక్ బ్లూ, మొజాయిక్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
From your first class to your final exam,⁰stay smooth with AI Boost, flagship UI experience, and plenty of space on #realmeP4Lite 5G.
— realme (@realmeIndia) March 16, 2026
Launching 19th Mar, 12PM.
Know More :https://t.co/9pTzXDOyJd https://t.co/qQFs1uRpOg pic.twitter.com/dhhfnXfMM9
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్ రేట్, 900 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు మరిన్ని ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్ ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్, MIL STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా పొరపాటున ఫోన్ కిందపడినా డ్యామేజీ అయ్యేందుకు తక్కువ అవకాశం ఉంటుంది.
మీడియాటెక్ చిప్ :
ఈ రియల్‌మి ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్ ను కలిగి ఉంటుంది. 5300mm Sq ఎయిర్‌ఫ్లో VC కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటి సమయాల్లో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం పనిచేస్తుంది.
7000mAh భారీ బ్యాటరీ :
రియల్‌మి P4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి సుమారుగా ఒకటిన్నర రోజు వరకు వినియోగించుకోవచ్చని రియల్‌మి చెబుతోంది. కెమెరా విభాగం పరంగా 13MP ప్రైమరీ కెమెరాతో లాంచ్ కానుంది.
* గత నెలలో రియల్‌మి P4 లైట్ 4G ఫోన్ విడుదల అయింది. ఫోన్ ప్రారంభ ధర రూ.9999 గా ఉంది. 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. UNISOC T7250 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత realme UI 6.0 పైన పనిచేస్తుంది. 13MP కెమెరా, 6300mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








