Home
Mobile

10,000mAh బ్యాటరీతో రియల్‌మీ P4 పవర్: ఛార్జింగ్ టైమ్, బ్యాటరీ డ్రెయిన్ వివరాలు ఇవే!

అక్టోబర్ 8న అమెజాన్, అక్టోబర్ 9న ఫ్లిప్‌కార్ట్ సేల్స్ ప్రారంభమవుతున్న తరుణంలో, భారత్‌లో 10,000mAh బ్యాటరీ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో ప్రధాన ఆకర్షణ రియల్‌మీ తీసుకొచ్చిన 'P4 Power'. 10,001mAh భారీ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్.. కొన్ని రోజుల పాటు ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు పవర్ బ్యాంక్‌లా వేరే డివైజ్‌లను ఛార్జ్ చేసుకునే (రివర్స్ ఛార్జింగ్) సదుపాయాన్ని అందిస్తోంది. గేమర్స్, ప్రయాణికులు, విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ఫోన్ ఛార్జింగ్ టైమ్స్, బ్యాటరీ డ్రెయిన్ వివరాలు, పట్టుకోవడానికి సౌకర్యంగా ఉందో లేదో ఇక్కడ చూద్దాం.

రియల్‌మీ P4 పవర్ ఫోన్‌ను బాక్స్‌తో వచ్చే 80W అడాప్టర్‌తో ఛార్జ్ చేస్తే.. కేవలం 36 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం ఛార్జ్ అవుతుంది. 91మొబైల్స్ టెస్టింగ్‌లో 20 నుంచి 100 శాతం అవ్వడానికి 80 నిమిషాలు పట్టింది. రియల్ వరల్డ్ వాడకంలో 0 నుంచి 100 శాతం ఫుల్ ఛార్జ్ కావడానికి దాదాపు 105 నిమిషాలు పడుతుంది. ఈ ఫోన్ బరువు 219 గ్రాములు. ఇది శామ్‌సంగ్ గెలాక్సీ M35 (222 గ్రాములు) బరువుకు దాదాపు దగ్గరగా ఉన్నప్పటికీ, పాత 7,000mAh ఫోన్ల కంటే బరువు తక్కువగానే అనిపిస్తుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ట్రాన్స్‌సిల్వర్ (TransSilver) వేరియంట్ లభిస్తుండగా, రీటైల్ స్టోర్లలో ట్రాన్స్‌బ్లూ (TransBlue), ట్రాన్స్‌ఆరెంజ్ (TransOrange) కలర్స్ అందుబాటులో ఉన్నాయి.

Realme P4 Power 5G Review: 10,001mAh Battery Charging Speed, Drain Test & Performance Details

10,000mAh ఫోన్ల ఛార్జింగ్ సమయం, బ్యాటరీ డ్రెయిన్ వివరాలు

మోడల్బ్యాటరీఇన్-బాక్స్ చార్జర్0–50 నిమి20–100 నిమి0–100 నిమి (≈)BGMI గరిష్ట ఉష్ణోగ్రత
realme P4 Power 5G10001mAh80W3680≈105≈35–42°C
Tecno Pova 6 Pro6000mAh70W———
Samsung Galaxy M35 5G6000mAh25W——114—
Samsung Galaxy F627000mAh25W—102≈120—

ఈ వివరాలు బ్రాండ్ స్పెక్స్, ఇండియన్ ల్యాబ్ రివ్యూల ఆధారంగా అందించాం. ఇందులో P4 పవర్ 0–50% ఛార్జింగ్ వివరాలను 'డిజిటల్ కెమెరా వరల్డ్' అందించగా, P4 పవర్, F62ల 20–100% టైమింగ్స్‌ను '91మొబైల్స్' సేకరించింది. M35 ఫోన్ 0–100% ఛార్జింగ్ సమయాన్ని 'మైస్మార్ట్‌ప్రైస్', అలాగే టెక్నో ఫోన్ గంటలోపే ఛార్జ్ అవుతుందన్న విషయాన్ని 'GSMArena', 'నోట్‌బుక్‌చెక్' వెల్లడించాయి. ఇండియన్ టెస్టింగ్‌తో పాటు బ్రాండ్ ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం.. P4 ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఉష్ణోగ్రత 35°C నుంచి 42°C వరకు నమోదు నమోదైంది.

10,000mAh ఫోన్లు వర్సెస్ 6000/7000mAh ఫోన్ల SOT, బ్యాటరీ డ్రెయిన్ పోలిక

మోడల్PCMark SOT (గం)YouTube 1గంమ్యాప్స్/GPS 1గంBGMI 2గం5G డ్యూయల్‑సిమ్ స్టాండ్‌బై 1గం
realme P4 Power 5G21.1≈3–4%≈4–5%≈15–20%≈0.8–0.9%
Tecno Pova 6 Pro15.9————
Samsung Galaxy M35 5G13.9————
Samsung Galaxy F6217.0————

థర్డ్ పార్టీ టెస్టుల్లో P4 పవర్ ఫోన్‌లో 12 గంటల పాటు యూట్యూబ్ స్ట్రీమింగ్ చేస్తే కేవలం 42 శాతం బ్యాటరీ మాత్రమే ఖర్చయింది. సింగిల్ ఛార్జ్‌పై 21.3 గంటల పాటు నావిగేషన్ వస్తుందని రియల్‌మీ చెప్తోంది. PCMark టెస్ట్‌లో ఇది 21.1 గంటల బ్యాటరీ లైఫ్ (SOT) ఇచ్చింది. ఇక బీబామ్ (Beebom) టెస్టింగ్ ప్రకారం.. డ్యూయల్ సిమ్ 5G నెట్‌వర్క్‌పై ఐడిల్‌గా ఉన్నప్పుడు గంటకు దాదాపు 0.85 శాతం మాత్రమే బ్యాటరీ డ్రెయిన్ అయింది. ప్రస్తుత 6,000–7,000mAh 'బ్యాటరీ బీస్ట్' ఫోన్లతో పోలిస్తే ఈ 10,001mAh ఫోన్ ఎందుకు ఎక్కువ సమయం వస్తుందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.

ఈ పండుగ సీజన్‌లో ప్రయాణించే వారి కోసం విమానయాన నిబంధనలకు సంబంధించిన ఒక ముఖ్యమైన చిట్కా: 10,001mAh సామర్థ్యం కలిగిన ఫోన్ దాదాపు 38–39Whకి సమానం. కాబట్టి దీనిని హ్యాండ్ బ్యాగేజ్ (క్యాబిన్)లో ఉంచుకోవాలి, చెక్-ఇన్ బ్యాగేజ్‌లో పెట్టకూడదు. చాలా విమానయాన సంస్థలు 100Wh కంటే తక్కువ ఉన్న పవర్ బ్యాంక్‌లను (గరిష్టంగా 2) క్యాబిన్ బ్యాగేజ్‌లోనే అనుమతిస్తాయి. అలాగే ఫ్లైట్‌లో ఛార్జ్ చేయడాన్ని నిరాకరిస్తాయి. కాబట్టి అదనపు బ్యాటరీలు లేదా పవర్ బ్యాంక్‌లను సురక్షితంగా హ్యాండ్ బ్యాగేజ్‌లోనే ఉంచుకోండి. రోజంతా గేమింగ్, నావిగేషన్ వాడాలనుకునే వారు ఈ సేల్‌లో ఫోన్ కొనేముందు ఈ విషయాలను గమనించడం మంచిది.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X