Home
Mobile

ఏకంగా 10000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లోకి P సిరీస్‌ ఫోన్ విడుదల కానుందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ ఆధారంగా ఈ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ సమాచారం వెల్లడయింది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల సహా బ్యాటరీ స్పెసిఫికేషన్‌లపై కీలక వివరాలు వెల్లడయ్యాయి.

రియల్‌మి ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ గ్లోబల్‌ హెడ్‌ ప్రాన్సిస్‌ వాంగ్‌ X పోస్ట్‌ ఆధారంగా రియల్‌మి నుంచి త్వరలో రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme P4 Power 5G Smartphone Teased) విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి.

Realme P4 Power 5G Smartphone teased in india

10,000mAh బ్యాటరీతో :
రియల్‌మి P4 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ ఏకంగా 10000mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 27W రివర్స్‌ ఛార్జింగ్‌, బైపాస్‌ ఛార్జింగ్‌ను కూడా సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేసి 1.5 రోజులు బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చని తెలుస్తోంది.

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ ఇటీవలే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్ (BIS) నుంచి ధ్రువీకరణ పొందినట్లు తెలుస్తోంది. RMX5107 మోడల్‌ నంబర్‌తో లిస్టింగ్‌ అయినట్లు తెలిసింది. దీని ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ త్వరలో భారత్ మార్కెట్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది.

ట్రిపుల్ కెమెరాలు :
రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ, 8MP సెకండరీ, 2MP కెమెరాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ మరిన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

గత సంవత్సరం రియల్‌మి P4 సిరీస్‌ ఫోన్లు విడుదల అయ్యాయి. ఇందులో భాగంగా రియల్‌మి P4 5G, P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌లు 7000mAh భారీ బ్యాటరీతోపాటు 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. రియల్‌మి P4 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.18499 గా ఉంది. అదే ప్రో మోడల్‌ ధర రూ.24999 గా ఉంది.

రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది. హైపర్‌ విజన్‌ చిప్‌ను కూడా అమర్చి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 16MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల FHD+ అమోలెడ్ 4D కర్వ్+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్‌, Hyper Vision చిప్‌ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా ఉంది. 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P4 Power 5G Smartphone teased in india expected to launch with 10000mAh battery
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X