Home
Mobile

10,001mAh భారీ బ్యాటరీతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌.. విడుదల తేదీ వెల్లడి..!

Realme P4 Power 5G Smartphone : రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌ లో ఏకంగా 10001mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుందని ఇటీవల లీక్స్‌ వచ్చాయి. రియల్‌మి కూడా రియల్‌మి P4 పవర్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కానుందని తెలిపింది. అయితే తాజాగా ఈ హ్యాండ్‌సెట్‌ విడుదల తేదీని రియల్‌మి వెల్లడించింది. ఈ ఫోన్ 10,001mAh బ్యాటరీలో అందుబాటులోకి వస్తుందని రియల్‌మి తెలిపింది.

ఎప్పుడు విడుదల కానుంది? :
రియల్‌మి ఇండియా వెల్లడించిన వివరాల ఆధారంగా రియల్‌మి P4 పవర్‌ స్మార్ట్‌ఫోన్ జనవరి 29 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్‌ రియల్‌మి వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌ లైవ్‌ లో ఉంది.

Realme P4 Power 5G smartphone launch date in india

ఏకంగా 10,001mAh బ్యాటరీ :
ఈ ఫోన్‌ 10,001mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి ఏకంగా 31 రోజులపాటు స్టాండ్‌బై టైంను అందిస్తుందని చెబుతోంది. లేదా 32.5 గంటల వీడియో ప్లేబ్యాక్‌ టైంను పొందుతుందని తెలిపింది.

పెర్ల్‌ అకాడమీతో :
ఈ హ్యాండ్‌సెట్‌ డిజైన్‌ కోసం పెర్ల్‌ అకాడమీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రియల్‌మి తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 1.5k రిజల్యూషన్‌ తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌ గా ఉంటుందని తెలుస్తోంది.

చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 OS :
ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ చిప్‌ 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

Realme P4 Power 5G smartphone launch date in india

ఈ హ్యాండ్‌సెట్‌ హైపర్‌ విజన్‌, ఏఐ చిప్‌సెట్‌ ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని తెలుస్తోంది.

50MP కెమెరా! :
కెమెరా విభాగం పరంగా రియల్‌మి P4 పవర్‌ స్మా్ర్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుందని సమాచారం.

ఎంత ధరలో అందుబాటులోకి వస్తుంది?
ఈ హ్యాండ్‌సెట్ భారత్ మార్కెట్‌ లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37999 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే బేస్ వేరియంట్ ధర రూ.30000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వస్తుందని సమాచారం. అయితే ఈ ధర సహా ఇతర స్పెసిఫికేషన్‌ లపై రియల్‌మి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P4 Power 5G smartphone with 10001mAh battery launch date confirmed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X