Home
Mobile

ఇవాళ్టి నుంచే 10,001mAh భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌.. ఎన్నో సూపర్‌ ఫీచర్లు..!

Realme P4 Power 5G Smartphone Sale : రియల్‌మి సంస్థ భారత్‌ మార్కెట్‌లో గత నెలలో భారీ బ్యాటరీతో రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఈ ఫోన్ ఏకంగా 10,001mAh బ్యాటరీ, 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 4D కర్వ్‌+, 50MP కెమెరాలను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సేల్‌ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు.

ధరల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, రిటైల్‌ అవుట్‌లెట్స్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.25999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.27999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.30999 గా ఉంది.

Realme P4 Power 5G Smartphone sale

నాలుగు కలర్‌ వేరియంట్స్ :
తొలిసేల్‌లో భాగంగా గరిష్ఠంగా రూ.5999 విలువైన ప్రయోజనాలను అందిస్తామని చెబుతోంది. దీంతోపాటు బ్యాంకు కార్డుల కార్డులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ ఫోన్‌ ట్రాన్స్‌ సిల్వర్‌, ట్రాన్స్‌ బ్లూ, ట్రాన్స్‌ ఆరెంజ్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది.

హైపర్‌ గ్లో డిస్‌ప్లే :
రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల 1.5K 4D కర్వ్‌+ హైపర్‌ గ్లో డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 6500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆర్మర్‌ షెల్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Realme P4 Power 5G Smartphone sale

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ హ్యాండ్‌సెట్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని రియల్‌మి చెబుతోంది.

50MP కెమెరా :
ఈ ఫోన్‌ 4613 sq mm ఎయిర్‌ఫ్లో వేపర్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు హైపర్‌ విజన్‌+ AI చిప్‌ను కూడా కలిగి ఉంది. 90fps BGMI ను సపోర్టు చేస్తుంది. కెమెరా విభాగం పరంగా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్, 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.

Realme P4 Power 5G Smartphone sale

10,001mAh భారీ బ్యాటరీ :
రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్ 10,001mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 27W వైర్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును సపోర్టు చేస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 932.6 గంటల స్టాండ్‌ బై టైంను అందిస్తుందని రియల్‌మి చెబుతోంది. భారీ బ్యాటరీ ఫోన్‌ల కోసం చూసే వారికి ఈ హ్యాండ్‌సెట్‌ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సుమారుగా ఒకటిన్నర రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P4 Power 5G Smartphone with 10001mAh Battery sale today in india full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X