Home
Mobile

10,001mAh భారీ బ్యాటరీతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌.. చిప్‌సెట్‌, డిస్‌ప్లే, కెమెరాల వివరాలు..!

Realme P4 Power 5G Smartphone : రియల్‌మి సంస్థ భారత్‌ మార్కెట్‌ లో భారీ బ్యాటరీతో ఫోన్‌ ను లాంచ్ చేయనుంది. రియల్‌మి P4 పవర్‌ 5G పేరుతో విడుదల కానున్న స్మార్ట్‌ ఫోన్ ఏకంగా 10,001mAh బ్యాటరీతో పనిచేస్తుంది. భారత్‌ లో తొలి భారీ బ్యాటరీ ఫోన్‌ గా నిలుస్తుంది. ఈ ఫోన్ జనవరి 29 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ గురించి ప్రస్తుతం అనేక వివరాలు అందుబాటులోకి వచ్చాయి.

4D కర్వ్ + డిస్‌ప్లే :
రియల్‌మి P4 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ 144Hz హైపర్‌ గ్లో 4D కర్వ్‌ + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 6500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ ట్రాన్స్‌వ్యూ డిజైన్‌ తో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులోకి వస్తుంది.

Realme P4 Power 5G Smartphone

మీడియాటెక్‌ చిప్‌సెట్‌ :
ఈ భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు హైపర్‌ విజన్‌, AI చిప్‌ లను కూడా కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది.

4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని సంస్థ హామీ ఇస్తోంది. 90FPS BGMI ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఏఐ హైపర్‌ క్లారిటీ, ఏఐ హైపర్‌ మోషన్‌, HDR వంటి ఫీచర్‌ లను సపోర్టు చేస్తుంది.

Realme P4 Power 5G Smartphone

భారీ బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్‌ 10,001mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 80W ఛార్జింగ్‌ సపోర్టుతో పనిచేస్తుంది. దీంతోపాటు బైపాస్‌, 27W రివర్స్‌ ఛార్జింగ్‌ ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 72.3 గంటల కాలింగ్‌ కోసం లేదా 32.5 గంటలపాటు యూట్యూబ్‌ స్ట్రీమింగ్‌ కోసం వినియోగించుకోవచ్చని తెలుస్తోంది.

కెమెరాల వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ కూడా ఉంటుంది. సెల్ఫీ కెమెరా వివరాలు తెలియాల్సి ఉంది. అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

జనవరి 29 వ తేదీన రియల్‌మి P4 పవర్‌ 5G స్మా్ర్ట్‌ఫోన్‌ తోపాటు రియల్‌మి బడ్స్‌ క్లిప్‌ ఇయర్‌బడ్స్‌, రియల్‌మి నుంచి 20,000mAh బ్యాటరీ సామర్థ్యంతో పవర్‌ బ్యాంక్‌ కూడా విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.30000 ధరలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌, ఇయర్‌బడ్స్, ఇయర్‌బడ్స్‌ గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P4 Power 5G Smartphone with 10001mAh battery specifications, chipset revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X