భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా... తాజాగా కీలక వివరాలు లీక్..!
రియల్‌మి నుంచి భారీ బ్యాటరీతో భారత్ మార్కెట్ లో ఓ ఫోన్ విడుదల కానుంది. రియల్‌మి P4 పవర్ (Realme P4 Power Smartphone) పేరుతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ విడుదలపై రియల్‌మి ఇప్పటికే ప్రకటన చేసింది. దీంతోపాటు అనేక స్పెసిఫికేషన్‌ల వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఫ్లి్ప్‌కార్ట్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్ సేల్ ప్రారంభం అవుతుంది.
ఏకంగా 10001mAh బ్యాటరీ! :
తాజాగా టిప్‌స్టర్ సంజు చౌదరి రియల్‌మి P4 పవర్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర సహా అనేక వివరాలను లీక్ చేశారు. ఈ వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 10,001mAh భారీ బ్యాటరీతో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది.

144Hz రీఫ్రెష్ రేట్!
టిప్‌స్టర్ వివరాల ఆధారంగా ఈ రియల్‌మి ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది.
మరో రెండు చిప్‌లు :
రియల్‌మి P4 పవర్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిప్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు AI చిప్, హైపర్‌విజన్ చిప్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని భావిస్తున్నారు.
Exclusive 💫
— Sanju Choudhary (@saaaanjjjuuu) January 19, 2026
realme p4 power (12/256GB) BOX MRP is ₹37,999 :
• 6.78” 144hz 4D curve + AMOLED
• MTK 7400 Ultra
• HyperVision+ AI chip
• 50MP OIS Main + 8 MP UW
• 16MP front
• 10,001mAh + 80W
• IP68/69, Plastic Frame , 219gm
• 3 Years of OS + 4 years of security… pic.twitter.com/vrXPxH3gca
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 50MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్, ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరాలతో లాంచ్ కానుందని భావిస్తున్నారు.
ఈ హ్యాండ్‌సెట్ 219 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది. ఆరెంజ్, సిల్వర్ కలర్ వేరియంట్స్‌లో లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ముందు వైపు గ్లాస్, వెనుక వైపు ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఎప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది? :
రియల్‌మి P4 పవర్ స్మార్ట్‌ఫోన్ జనవరి 29 వ తేదీన విడుదల కానుందని అంచనా వేస్తున్నారు. అయితే రియల్‌మి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.37999 గా ఉంటుందని టిప్‌స్టర్ సంజు చౌదరి అంచనా వేశారు.
ఈ వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.30000 కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. భారత్ మార్కెట్‌లో ఈ ఫోన్ రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లో సేల్ ప్రారంభం అవుతుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








