Home
Mobile

రూ.3 వేల డిస్కౌంట్‌తో 7000mAh భారీ బ్యాటరీ, 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే ఫోన్‌ సేల్‌..!

Realme P4 Pro 5G Smartphone Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లో రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది. ఇందులో రియల్‌మి P4 5G, రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయ్యాయి. బేస్‌ వేరియంట్‌ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ప్రో మోడల్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్లు 7000mAh భారీ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.

రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
రియల్‌మి P4 ప్రో 5G ఫోన్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.24999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28999 గా ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది.

realme P4 Pro 5G smartphone price

రూ.3 వేల డిస్కౌంట్‌ :
ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు రూ.2 వేల ఎక్స్ఛేంజీ బోనస్‌ను కూడా అందిస్తోంది. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్‌ స్టోర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రో మోడల్‌ బ్రీచ్‌ వుడ్‌, డార్క్‌ ఓక్‌, మిడ్‌నైట్‌ ఐవీ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే :
రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల FHD+ అమోలెడ్ 4D కర్వ్+ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 6500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ థర్మల్‌ మేనేజ్‌మెంట్ కోసం 7000 sq mm ఎయిర్‌ఫ్లో VC కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

realme P4 Pro 5G smartphone price

ప్రత్యేక చిప్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్ Hyper Vision చిప్‌ను కూడా అమర్చి ఉంది. దీని ద్వారా గేమ్ ప్లే, ఫ్రేమ్‌ రేట్‌, లైటింగ్‌ మెరుగవుతుందని రియల్‌మి చెబుతోంది. మరియు ఈ ఫోన్‌ BGMI 144fps, 1.5K రిజల్యూషన్‌ను సపోర్టు చేస్తుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చారు.

realme P4 Pro 5G smartphone price

ఈ ఫోన్‌ ముందు, వెనుక కెమెరాలతో 60fps వద్ద 4K వీడియోలను రికార్టు చేయవచ్చు. దీంతోపాటు ఈ ఫోన్‌ అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో AI Party Mode, AI Text Scanner, AI Snap Mode, AI Landscape వంటి ఫీచర్లున్నాయి.

రియల్‌మి P4 ప్రో మోడల్‌ స్మార్ట్‌ఫోన్ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 10W రివర్స్‌ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు IP65 + IP66 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రిసెస్టెంట్‌గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G, బ్లూటూత్‌ 5.4, WiFi 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
realme P4 Pro 5G smartphone sale to start from today, how to get Rs3000 discount
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X