7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలు, 144Hz రీఫ్రెష్ రేట్ తో 5G స్మార్ట్‌ఫోన్..!
రియల్‌మి నుంచి ఇటీవల భారత్ మార్కెట్‌లో రియల్‌మి 16 ప్రో సిరీస్ విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 16 ప్రో, రియల్‌మి 16 ప్రో ప్లస్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌లు 200MP కెమెరాను కలిగి ఉన్నాయి. ఇటీవలే ఈ సిరీస్ ఫోన్‌ల సేల్ కూడా ప్రారంభం అయింది. గత సంవత్సరం ఆగస్టు నెలలో రియల్‌మి P4 సిరీస్‌లో భాగంగా P4, P4 ప్రో మోడల్స్ లాంచ్ అయ్యాయి.
రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Realme P4 Pro 5G Smartphone) ప్రస్తుతం రూ.25 వేల ధరలో అందుబాటులో ఉంది. ఈ ధర సెగ్మెంట్‌లో ఫోన్ కోసం చూస్తున్న వారికి మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. డిజైన్ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకుంటుంది. మరియు 7000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, 144Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.24,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.26999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28999 గా ఉంది. బిర్చ్ వుడ్, డార్క్ ఓక్ వుడ్, మిడ్‌నైట్ ఇవీ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
144Hz రీఫ్రెష్ రేట్ :
రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 144Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల FHD+ అమోలెడ్ 4D కర్వ్+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 6500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

హైపర్ విజన్ చిప్ :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ చిప్‌సెట్‌తోపాటు Hyper Vision చిప్‌ను కూడా అమర్చారు. మెరుగైన గేమ్ ప్లే, ఫ్రేమ్ రేట్ కోసం ఈ చిప్ పనిచేస్తుంది.
7000mAh భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తోంది. మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 7000 Sq mm ఎయిర్‌ఫ్లో VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ BGMI 144fps ను సపోర్టు చేస్తుంది. 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌తో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.
50MP సెల్ఫీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కోసం ముందు వైపు 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు 60fps తో 4K వీడియోలను రికార్డింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ ఫోన్ AI Landscape, AI Text Scanner, AI Party Mode, AI Snap Mode వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ IP65 + IP66 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








