Home
Mobile

45W ఫాస్ట్‌ ఛార్జింగ్, 90fps, VC కూలింగ్ ఛాంబర్‌ తో 5G స్మార్ట్‌ఫోన్‌... స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు

Realme P4x 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి P సిరీస్‌ నుంచి త్వరలో స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్ చేస్తామని ఇటీవలే వెల్లడించింది. అయితే తొలుత ఫోన్ పేరు సహా ఇతర వివరాలను వె‌ల్లడించలేదు. అయితే తాజాగా ఈ ఫోన్‌ కు సంబంధించిన అనేక వివరాలను షేర్‌ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్‌ ఆధారంగా వివరాలు వచ్చాయి.

రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో త్వరలో విడుదల కానుంది. రియల్‌మి P4 సిరీస్‌ నుంచి ఇప్పటికే P4, P4 ప్రో మోడల్స్‌ లాంచ్ కాగా.. ఈ సిరీస్‌లో మూడో ఫోన్‌గా P4x లాంచ్‌ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది.

Realme P4x 5G smartphone

VC కూలింగ్‌ సిస్టమ్‌తో :
ఈ స్మార్ట్‌ఫోన్‌ లో గేమింగ్‌, మల్టీ టాస్కింగ్ సమయాల్లో మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌, స్థిరమైన పనితీరు కోసం VC కూలింగ్‌ ఛాంబర్‌ తో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో ఒకేసారి 18 యాప్‌లను సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చని రియల్‌మి చెబుతోంది.

ఫాస్ట్‌ ఛార్జింగ్‌, బైపాస్‌ ఛార్జింగ్ :
ఈ రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, బైపాస్‌ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. గేమింగ్, ఛార్జింగ్ సందర్భాల్లో ఫోన్‌ వేడెక్కకుండా బైపాస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ పనిచేస్తుంది. గేమింగ్‌ కోసం ఈ ఫోన్‌లో GT మోడ్‌లో 90FPS గేమ్‌ప్లేను సపోర్టు చేస్తుందని ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ఆధారంగా వెల్లడయింది.

మీడియాటెక్‌ చిప్‌సెట్ :
రియల్‌మి ఫోన్‌ ప్రాసెసర్‌, బ్యాటరీ వివరాలు వెల్లడి చేయలేదు. అయితే గూగుల్‌ ప్లే కన్సోల్‌, గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌ ఆధారంగా ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 పైన పనిచేసే అవకాశం ఉంది. ది టెక్‌ ‌అవుట్‌లుక్‌ ఈ వివరాలను వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. 8GB ర్యామ్‌ తో జతచేసే అవకాశం ఉంది.

రియల్‌మి P4x 5G భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుందని సంస్థ ధ్రువీకరణ చేసింది. అయితే కచ్చితంగా ఎప్పుడు లాంచ్‌ కానుందనే వివరాలు వెల్లడి కాలేదు. త్వరలో ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

* రియల్‌మి నుంచి ఇటీవలే GT 8 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయింది. ఈ ఫోన్ స్నాప్‌‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. 120W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX906 ప్రైమరీ కెమెరా (OIS), 50MP అల్ట్రావైడ్‌ కెమెరా, 120x డిజిటల్‌ జూమ్‌తో 200MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. వెనుక వైపు ఉన్న కెమెరాలతో 60fps వద్ద 4K రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డు చేయవచ్చు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Realme P4x 5G smartphone confirmed to launch in india soon with VC Cooling
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X