Home
Mobile

రూ.13499 ధరకు 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz రీఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్‌!

Realme P4x 5G Smartphone launched : రియల్‌మి భారత్‌ మార్కెట్‌ లో P4 సిరీస్‌ నుంచి కొత్త హ్యాండ్‌సెట్‌ ను విడుదల చేసింది. రియల్‌మి P4x 5G పేరుతో లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ 7000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ల వివరాలు.

రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.72 అంగుళాల ఫుల్‌ HD LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 391 ppi పిక్సల్‌ డెన్సిటీ, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ లేక్ గ్రీన్, మ్యాటీ సిల్వర్‌, ఎలిగెంట్‌ పింక్‌ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

Realme P4x 5G smartphone

మీడియాటెక్‌ చిప్‌సెట్‌ :
ఈ ఫోన్‌ 6nm ఆక్టాకోర్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. వర్చువల్‌ ర్యామ్‌ ఆప్షన్ ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తుంది.

50MP కెమెరా, 7000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చారు. 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ రివర్స్‌ ఛార్జింగ్‌తోపాటు బైపాస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది.

Realme P4x 5G smartphone

కూలింగ్‌ సిస్టమ్‌ :
ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. స్టీల్‌ ప్లేట్‌, కాపర్‌ గ్రాఫైట్‌ కోటింగ్‌ తో కూడిన 5300mm sq వేపర్‌ ఛాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ రెండు స్పీకర్‌ లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌, వైఫై, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టు సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15499, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.16999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉంది.

ప్రారంభ ఆఫర్‌ లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ ను రూ.13499 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చని రియల్‌మి తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌ సేల్‌ డిసెంబర్‌ 10 వ తేదీ 12 గంటలకు ప్రారంభం కానుంది. రియల్‌మి ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో ఇటీవల విడుదల అయింది. ఈ ఫోన్‌ 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌, 50MP కెమెరా, 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.14999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P4x 5G smartphone launched with 7000mAh battery, mediatek dimensity 7400 ultra chip in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X