Home
Mobile

7000mAh భారీ బ్యాటరీ, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్‌తో 5G ఫోన్‌..!

Realme India : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌ లోకి ఈ వారంలో C సిరీస్‌ ఫోన్‌ విడుదల కానుంది. అదే వచ్చేవారంలో P సిరీస్‌ నుంచి హ్యాండ్‌సెట్ తోపాటు రియల్‌మి వాచ్ 5 కూడా అందుబాటులోకి రానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు విడుదల కానున్నాయి :
రియల్‌మి C85 5G స్మార్ట్‌ఫోన్ నవంబర్‌ 28 వ తేదీన విడుదల కానుంది. తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా డిసెంబర్‌ 4 వ తేదీన రియల్‌మి P4x 5G, రియల్‌మి వాచ్‌ 5 లాంచ్‌ కానున్నాయి. ఈ P4 సిరీస్‌ ఫోన్‌ గురించి కీలక స్పెసిఫికేషన్‌ ల వివరాలు వెల్లడయ్యాయి.

Realme P4x 5G Smartphone  Realme Watch 5 Smartwatch launch dates revealed in india

రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ :
రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ (Realme P4x 5G Smartphone) ఏరోస్పేస్‌ ప్రభావిత డిజైన్‌ ను కలిగి ఉంటుంది. మరియు 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో కూడిన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలిపింది. గేమింగ్ సహా ఇతర సమయాల్లో మెరుగైన పనితీరును అందిస్తుందని చెబుతోంది. అయితే డిస్‌ప్లే పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. డైనమిక్‌ ర్యామ్ ద్వారా గరిష్ఠంగా 18GB వరకు ర్యామ్‌ ను పొడిగించుకోవచ్చని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్ ఫ్రీ ఫైర్‌, BGMI ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు గేమింగ్‌ సహా మల్టీ టాస్కింగ్‌ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేలా 5300 mm sq వేపర్‌ ఛాంబర్‌ కూలింగ్ సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది.

రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. రూ.20 వేల ధర రేంజ్‌లో భారత్‌ మార్కెట్‌ లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Realme P4x 5G Smartphone  Realme Watch 5 Smartwatch launch dates revealed in india

రియల్‌మి వాచ్‌ 5 :
ఈ ఫోన్‌తోపాటు రియల్‌మి వాచ్‌ 5 (Realme Watch 5 India Launch) కూడా డిసెంబర్‌ 4 వ తేదీన విడుదల కానుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ మెటాలిక్‌ యూనిబాడీ డిజైన్‌ తో అందుబాటులోకి రానుంది. దీంతోపాటు అల్యూమినియం క్రౌన్‌ తోపాటు ముందు వైపు ఫ్లాట్‌ గ్లాస్‌ ను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ 1.97 అంగుళాల అల్యూమినియం డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌వాచ్‌ను పూర్తిగా ఛార్జింగ్‌ చేసి Light Mode లో వినియోగిస్తే 20 రోజుల బ్యాటరీ లైఫ్‌ ను పొందుతుందని రియల్‌మి తెలిపింది. ఈ వాచ్ అనేక హెల్త్‌, ఫిట్‌నెస్ ట్రాకర్లను కలిగి ఉంటుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

రియల్‌మి P4x 5G, రియల్‌మి వాచ్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌ తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, భాగస్వామ్య రిటైల్‌ స్టోర్‌ లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P4x 5G Smartphone, Realme Watch 5 Smartwatch launch dates revealed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X