Home
Mobile

రూ.15999 ధరకే 7000mAh భారీ బ్యాటరీ, బైపాస్‌ ఛార్జింగ్‌, 50MP కెమెరాతో 5G స్మార్ట్‌ఫోన్!

Realme P4x 5G Smartphone : భారత్‌ మార్కెట్‌ లోకి ఇటీవలే రియల్‌మి P4 సిరీస్‌ లో భాగంగా రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ బడ్జెట్‌ ధరలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్, 50MP కెమెరా, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ బడ్జెట్‌ సెగ్మెంట్‌ లో లాంచ్‌ అయినా.. మరిన్ని ప్రత్యేక ఫీచర్‌ లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌ లు, ధర, సేల్‌ పూర్తి వివరాలు.

ధర, సేల్‌, డిస్కౌంట్‌ ఆఫర్‌ :
రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.17499, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.19499 గా ఉంది.

Realme P4x 5G pricedrop

మూడు కలర్‌ వేరియంట్స్‌ :
ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి వెబ్‌సైట్‌ లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌, క్యాష్‌బ్యాక్‌ ను అందిస్తోంది. ఈ ఫోన్‌ ఎలిగెంట్‌ పింక్‌, లేక్ గ్రీన్, మ్యాటీ సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే వివరాలు :
రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.72 అంగుళాల ఫుల్‌ HD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

ఆండ్రాయిడ్ 15 OS :
రియల్‌మి ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. వర్చువల్‌ ర్యామ్ ఆప్షన్‌ కూడా అంది. ఫలితంగా ర్యామ్‌ ను పొడిగించుకొనే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ మూడు స్టోరేజీ వేరియంట్స్‌ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.

Realme P4x 5G pricedrop

7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్‌ కాపర్‌ గ్రాఫైట్‌ కోటింగ్‌, స్టీల్‌ ప్లేట్‌ తో కూడిన 5300mm Sq వేపర్‌ ఛాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి. 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.

రివర్స్‌ ఛార్జింగ్‌, బైపాస్‌ ఛార్జింగ్‌ :
కనెక్టివిటీ పరంగా రియల్‌మి P4x 5G స్మార్ట్‌ ఫోన్ 5G, 4G, Wi-Fi, బ్లూటూత్‌, GPS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ రివర్స్‌ ఛార్జింగ్‌, బైపాస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం డ్యూయల్‌ స్పీకర్‌ లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P4x 5G smartphone with 7000mAh Battery, 50MP Camera now available at Rs15999 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X