రూ.2000 డిస్కౌంట్‌లో 12200mAh భారీ బ్యాటరీ ట్యాబ్లెట్ సేల్..!
రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్‌లో ఈ నెల తొలివారంలో రియల్‌మి ప్యాడ్ 3 ట్యాబ్లెట్‌ను (Realme Pad 3 Tablet) లాంచ్ చేసింది. రియల్‌మి 16 ప్రో సిరీస్, రియల్‌మి బడ్స్ ఎయిర్ 8 ఇయర్‌బడ్స్ (Realme Buds Air 8 Earbuds) తోపాటు విడుదల అయింది. స్మార్ట్‌ఫోన్ సిరీస్ సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ప్యాడ్, ఇయర్‌బడ్స్ సేల్ ప్రారంభం కానుంది. తొలి సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌లను కూడా అందిస్తుంది.
రియల్‌మి ప్యాడ్ 3 ట్యాబ్లెట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ (WiFi) ధర రూ.26,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi + 5G) ధర రూ.29,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (WiFi + 5G) ధర రూ.31,999 గా ఉంది.

రూ.2000 డిస్కౌంట్ :
ఈ ట్యాబ్లెట్‌ను రియల్‌మి వెబ్‌సైట్, రియల్‌మి స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది. ఈ ప్యాడ్‌ను ఛాంపియన్ గోల్డ్, స్పేస్ గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
2.8K డిస్‌ప్లే :
రియల్‌మి ప్యాడ్ 3 ట్యాబ్లెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 11.61 అంగుళాల 2.8K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
రియల్‌మి ట్యాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మ్యాక్స్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. Arm Mali G615 GPU కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని తెలుస్తోంది.
ఈ ప్యాడ్ 12,200mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 6.5W రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. కెమెరా విభాగం పరంగా రియల్‌మి ప్యాడ్ 3 వెనుక వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు.
ఈ ట్యాబ్లెట్ డాల్బీ ఆడియో సపోర్టుతో క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. బ్లూటూత్ 5.4, WiFi 5, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్, ఇ-కంపాస్, హాల్ సెన్సర్‌లు ఉన్నాయి.
రియల్‌మి బడ్స్ ఎయిర్ 8 ఇయర్‌బడ్స్ :
రియల్‌మి బడ్స్ ఎయిర్ 8 ఇయర్‌బడ్స్ ధర రూ.3799 గా ఉంది. తొలి సేల్‌లో భాగంగా రూ.3599 కే కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి ఇండియా వెబ్‌సైట్, రిటైల్ స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్ మాస్టర్ గ్రే, మాస్టర్ గ్రే, మాస్టర్ పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
రియల్‌మి బడ్స్ డ్యూయల్ డ్రైవర్‌లను కలిగి ఉంది. స్పేషియల్, డైనమిక్ ఆడియో ప్రాసెసింగ్ ఆధారిత HRTF తో 3D స్పేషియల్ ఆడియో సపోర్టును కలిగి ఉంది. రియల్‌టైమ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) 55dB సపోర్టును కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
ఈ బడ్స్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 58 గంటల బ్యాటరీ లైఫ్ (ANC Off, AAC 50 శాతం వాల్యూమ్) గా ఉంది. పూర్తి ఛార్జింగ్ చేసేందుకు 2 గంటల సమయం పడుతుందని తెలిపింది.


Click it and Unblock the Notifications








