పెరగనున్న రియల్‌‌మి ఫోన్ ధరలు కారణం ఏంటో తెలుసా...?

రియల్‌‌మి సి1, రియల్‌‌మి 2 ఫోన్లను ఈ రోజు మొదలుకొని అదనపు ధరకు విక్రయించబోతున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

|

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పోకు చెందిన రియల్‌‌మి సి1, రియల్‌‌మి 2 ఫోన్లను ఈ రోజు మొదలుకొని అదనపు ధరకు విక్రయించబోతున్నట్లు రియల్‌‌మి సంస్థ అధికారికంగా ప్రకటించింది. రియల్‌‌మి సి1 ధర 1000 రూపాయలు పెంచగా, రియల్‌‌మి 2 బేస్ మోడల్ ధర 500 రూపాయలు పెంచబడింది.ఈ ఫోన్లకు వినియోగదారుల నుంచి విశేష రీతిలో ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలోనే ఫోన్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇటీవలే విడుదలైన రియల్ మి 2, రియల్ మి సి1 ఫోన్ల ధరలను పెంచినట్లు ఒప్పో తెలిపింది.అయితే రియల్‌‌మి 2 ప్రొ , రియల్‌‌మి 2 ధరలు ఇప్పటివరకు పెరగలేదు.రాబోయే రోజుల్లో రియల్‌‌మి 2 ప్రొ ధర కూడా పెంచబోతున్నట్లు తెలుస్తోంది.

జియో దీపావళి బంపర్ ఆఫర్ : నవంబర్ 12 వరకు ఓపెన్ సేల్ లో జియోఫోన్ 2జియో దీపావళి బంపర్ ఆఫర్ : నవంబర్ 12 వరకు ఓపెన్ సేల్ లో జియోఫోన్ 2

రియల్‌‌మి 2....

రియల్‌‌మి 2....

రియల్‌‌మి 2 మోడల్ విషయానికి వస్తే, కేవలం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే ఈ ఫోన్ లబిస్తుంది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,990 ఉండగా, పెరిగిన ధర తరువాత ఇప్పుడీ ఫోన్ రూ.9,499 ధరకు లభిస్తున్నది. అలాగే ఇదే ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,990 ధరకు లభిస్తున్నది.

రియల్‌‌మి 2  ఫీచర్స్...

రియల్‌‌మి 2 ఫీచర్స్...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

రియల్‌‌మి సి1...

రియల్‌‌మి సి1...

రియల్‌‌మి సి1లో 2జిబి ర్యామ్ , 16జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఇప్పటివరకు 6,999 రూపాయలకి లభించేది . ఇప్పుడు ఈ ఫోన్ వినియోగదారులకు రూ.7,999 ధరకు లభిస్తున్నది.

రియల్‌‌మి సి1 ఫీచర్స్...

రియల్‌‌మి సి1 ఫీచర్స్...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Realme phones to get price hike after Diwali, hints CEO Madhav Seth Twitted.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X