Home
Mobile

రేపటి నుంచే పవర్‌ డేస్‌ సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు.. పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్స్‌ తయారీ సంస్థ రియల్‌మి రేపటి (ఫిబ్రవరి 19) నుంచి పవర్‌ డేస్‌ సేల్‌ ను ప్రారంభించనుంది. ఈ సేల్‌ ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సమయంలో రియల్‌మి వెబ్‌సైట్‌ (realme.com), ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డిస్కౌంట్‌లను పొందవచ్చు. రియల్‌మి P4 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు.

రియల్‌మి పవర్‌ డేస్‌ సేల్‌ లో (Realme Power Days Sale) భాగంగా ఇటీవల 10,001mAh భారీ బ్యాటరీతో లాంచ్‌ అయిన రియల్‌మి P4 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌తోపాటు రియల్‌మి P4 5G, రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు.

Realme Power Days Sale

రియల్‌మి P4 పవర్ 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్‌ (Realme P4 Power 5G Smartphone) ప్రస్తుతం 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.25999, 8GB ర్యామ్ + 26GB స్టోరేజీ ధర రూ.27999, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30999 గా ఉంది. సేల్‌ సమయంలో రూ.2000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల 1.5K 4D కర్వ్‌+ హైపర్‌ గ్లో డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 6500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్, 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతోంది. ఎయిర్‌ఫ్లో వేపర్‌ ఛాంబర్‌, హైపర్ విజన్+ AI చిప్‌ను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 10,001mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 27W వైర్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ఆర్మర్‌ షెల్‌ ప్రొటెక్షన్‌, IP66 + IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Realme Power Days Sale

రియల్‌మి P4 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్‌ (Realme P4 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.21999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.23999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.2000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ ఫోన్‌ (Realme P4x 5G Smartphone) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Power Days Sale to start from today best deals on P4 series smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X