Home
Mobile

రియల్‌మి రిపబ్లిక్‌ డే సేల్‌ 2025.. ఈ స్మార్ట్‌ఫోన్‌ పైన ఏకంగా రూ.10 వేలు డిస్కౌంట్.. పూర్తి వివరాలు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల తయారీ సంస్థ రియల్‌మి.. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రత్యేక సేల్‌ను (Realme India) ప్రకటన చేసింది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్‌లను అందించనున్నట్లు తెలిపింది. కొన్ని హ్యాండ్‌సెట్‌లపై గరిష్ఠంగా రూ.10,000, రూ.5000 డిస్కౌంట్‌ను అందించనున్నట్లు పేర్కొంది. రియల్‌మి రిపబ్లిక్‌ డే సేల్‌ 2025 సేల్‌ ప్రారంభం సహా ఆఫర్లు, ఉత్పత్తుల వివరాలపై పూర్తి కథనం.

రియల్‌మి రిపబ్లిక్‌ డే సేల్‌ (Realme Republic Day Sale 2025) జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. 19 వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్‌, ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో జరగనుంది. రియల్‌మి స్టోర్‌ల ద్వారా కూడా కొన్ని ఫోన్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చని రియల్‌మి వెల్లడించింది.

Realme republic day sale 202

స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌ :
రియల్‌మి P2 ప్రో 5G, రియల్‌మి 14X, రియల్‌మి 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. వీటితోపాటు రియల్‌మి నార్జో 70 టర్బో 5G, రియల్‌మి GT 6T, రియల్‌మి 13 ప్లస్‌ 5G, రియల్‌మి 13 ప్రో 5G హ్యాండ్‌సెట్‌లను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

రూ.10,000 తగ్గింపు! :
రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను పొందవచ్చని రియల్‌మి తెలిపింది. రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా రూ.30,999 ధర కలిగిన ఫోన్‌ రూ.23,999 కే అందుబాటులో ఉంటుందని తెలిపింది. టాప్‌ఎండ్‌ వేరియంట్‌పై ఏకంగా రూ.10,000 వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు తెలిపింది.

రూ.5000 డిస్కౌంట్‌ :
రియల్‌మి GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.5000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.59,999 కాగా రూ.54,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 16GB ర్యామ్ వేరియంట్‌ను రూ.6000 డిస్కౌంట్‌కు కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా ధర రూ.59999 గా ఉండనుంది.

రియల్‌మి 13 ప్రో స్మార్ట్‌ఫోన్ పై రూ.3000 తగ్గింపును పొందవ‌చ్చు. ఫలితంగా ఫోన్‌ను రూ.23,999 కే సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి 13 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,999 నుంచి రూ.16,999 కే అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రియల్‌మి 14X హ్యాండ్‌సెట్‌పై రూ.1,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.13,999 కే ఫోన్‌ అందుబాటులోకి వస్తుంది.

రియల్‌మి P2 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల ధరతో పోలిస్తే రూ.4000 డిస్కౌంట్‌కు కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్‌ పై రూ.2000 తగ్గింపు ధరను పొందవచ్చు. ఫలితంగా హ్యాండ్‌సెట్‌ రూ.14,999 కే కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా TWS బడ్స్ పైనా డిస్కౌంట్‌లను అందిస్తున్నట్లు పేర్కొంది.

రియల్‌మి బడ్స్‌ ఎయిర్‌ 6, బడ్స్‌ T110 పై రూ.500 చొప్పున డిస్కౌంట్‌లను పొందవచ్చు. అదే రియల్‌మి బడ్స్‌ T310 పై ఏకంగా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ బడ్స్ ధర రూ.2199 నుంచి రూ.1999 కే అందుబాటులోకి వస్తాయని తెలిపింది. రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా మరిన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను పొందవచ్చని రియల్‌మి వెల్లడించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme republic day sale 2025 starts from january 13 onwards in india here are the best deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X