10001mAh భారీ బ్యాటరీతో మరో స్మార్ట్‌ఫోన్.. ఎప్పుడు విడుదల కానుందంటే..?
భారత్ మార్కెట్ లో రియల్‌మి సంస్థ (Realme India) ఇటీవల అనేక మోడల్స్ లాంచ్ చేస్తోంది. జనవరి ప్రారంభంలో రియల్‌మి 16 ప్రో సిరీస్ విడుదల అయింది. ఫిబ్రవరిలో ఏకంగా 10,001mAh బ్యాటరీతో రియల్‌మి P4 పవర్ 5G ఫోన్ ను విడుదల చేసింది. అనంతరం రియల్‌మి p4 లైట్ 4G లాంచ్ అయింది. మార్చి 7 వ తేదీన రియల్‌మి C83 5G ఫోన్ అందుబాటులోకి రానుంది. అయితే తాజాగా వెల్లడయిన వివరాల ఆధారంగా భారీ బ్యాటరీతో రియల్‌మి నుంచి మరో స్మార్ట్‌ఫోన్ కానుంది.
మరో భారీ బ్యాటరీ ఫోన్ :
రియల్‌మి ఇండియా తాజా ప్రకటన ఆధారంగా మార్చి 5 వ తేదీన రియల్‌మి నార్జో పవర్ 5G స్మార్ట్‌ఫోన్ (Realme Narzo Power 5G Smartphone) విడుదల కానుంది. రియల్‌మి P4 పవర్ తరహాలోనే 10,001mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రియల్‌మి ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌తోపాటు (Amazon) ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్ లో లభిస్తుంది.

రివర్స్ ఛార్జింగ్ సపోర్టు :
రియల్‌మి నార్జో పవర్ 5G స్మార్ట్‌ఫోన్ 80W ఛార్జింగ్ సపోర్టుతోపాటు రివర్స్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత realme UI 7.0 పైన పనిచేస్తుంది. IP66, IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
గత నెలలో తొలి భారీ బ్యాటరీ ఫోన్! :
గత నెలలో లాంచ్ అయిన రియల్‌మి P4 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల 1.5K 4D కర్వ్+ హైపర్ గ్లో డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్ రేట్, 6500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఆర్మర్ షెల్ ప్రొటెక్షన్ ను పొందుతుంది.
ఈ ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుంది. హైపర్ విజన్+ AI చిప్‌తోపాటు 4613 sq mm ఎయిర్‌ఫ్లో వేపర్ ఛాంబర్ కూడా ఉన్నాయి.
కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. 8MP అల్ట్రావైడ్, 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 80W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్ రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 10,001mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది.
ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.25999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.27999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.30999 గా ఉంది. ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








