ఏకంగా 5 రోజుల బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఫోన్‌ను ప్రదర్శించిన రియల్‌మి.. ఇన్‌బిల్ట్ ఫ్యాన్‌తో మరో ఫోన్ కూడా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి బుధవారం చైనాలో నిర్వహించిన 828 ఫ్యాన్ ఫెస్టివల్‌లో 15000mAh భారీ బ్యాటరీ కాన్సెప్ట్ ఫోన్ సహా ఛిల్ ఫ్యాన్ ఫోన్ కూడా ప్రదర్శించింది. ఈ ఫోన్ బిల్ట్ ఇన్ ఫ్యాన్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.
15,000mAh బ్యాటరీ ఫోన్ :
రియల్‌మి 828 ఫ్యాన్ ఫెస్టివల్ లో 15000mAh భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించింది. ఈ ఫోన్ ద్వారా ఇతర స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్స్‌ను ఛార్జింగ్ చేయవచ్చని చెబుతోంది. ఈ ఫోన్ 50 గంటల వీడియో ప్లేబ్యాక్ టైంను అందిస్తుందని చెబుతోంది.

ఒక్కసారి ఛార్జింగ్ చేసి 25 సినిమాలు చూడవచ్చు :
రియల్‌మి వైస్ ప్రెసిడెంట్ Chase Xu తెలిపిన వివరాల ఆధారంగా 15000mAh భారీ బ్యాటరీ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి, ఏకంగా 25 సినిమాలను వరుసగా వీక్షించవచ్చని తెలిపారు. ఈ ఫోన్ 18 గంటలపాటు వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుందని చెప్పారు. లేదా 30 గంటల గేమింగ్ టైంను కూడా అందిస్తుందని చెప్పారు.
5 రోజుల బ్యాటరీ లైఫ్ :
ఈ రియల్‌మి 15000mAh బ్యాటరీ కాన్సెప్ట్ ఫోన్ సాధారణ వినియోగదారులకు ఏకంగా 5 రోజులపాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని సంస్థ చెబుతోంది. లేదా ఫ్లైట్ మోడ్‌లో ఏకంగా 3 నెలలపాటు స్టాండ్‌బై టైమ్‌ను అందిస్తుంది. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌ల వివరాలు వెల్లడించలేదు.
Did you watch the livestream just now? During the event, we introduced two groundbreaking concept phones that represent realme's commitment to innovation: the realme 15000mAh, which delivers up to five days of DOU on a single charge, and the realme Chill Fan Phone, which reduces… pic.twitter.com/FfeG5ubm2b
— Chase (@ChaseXu_) August 27, 2025
లీక్స్ సహా ఇతర వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ పైన పనిచేసే అవకాశం ఉంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. వర్చువల్ ర్యామ్‌ను ఆప్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ రియల్‌మి కాన్సెప్ట్ ఫోన్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే టీజర్ ఫోటోల ఆధారంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది.
చిల్ ఫ్యాన్ ఫోన్ :
మరో కాన్సెప్ట్ ఫోన్ 'బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్' ను కలిగి ఉంది. అందువల్ల చిల్ ఫ్యాన్ ఫోన్ అనే పేరు పెట్టారు. అంతర్గతంగా ఏసీ మాదిరిగా పనిచేస్తుందని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ ఫోన్ ఎడమ వైపు గాలి బయటకు వెళ్లేందుకు వీలుగా ఎయిట్ వెంట్స్ గ్రిల్‌ను కలిగి ఉంది.
ఈ ఇన్ బిల్ట్ ఫ్యాన్ కారణంగా స్మార్ట్‌ఫోన్ ఉష్ణోగ్రత ఏకంగా 6 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుందని రియల్‌మి వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. డిజైన్ పరంగా రియల్‌మి GT 7T తరహా కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ రెండు మోడల్స్ అందుబాటులోకి రానున్నాయా లేదా కేవలం కాన్సెప్ట్ ఫోన్‌లుగా ఉండిపోతాయా అనేది తెలియాల్సి ఉంది.
15000mAh భారీ బ్యాటరీ, కూలింగ్ టెక్నాలజీని కలిగిన రెండు కాన్సెప్ట్ ఫోన్లు రియల్‌మి R &D సామర్థ్యం, పురోగతిని ప్రదర్శిస్తున్నాయి. త్వరలో మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








