Home
Mobile

Discounts on Realme Smartphones రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. సేల్‌ పూర్తి వివరాలు..!!

ప్రస్తుతం అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ కొనుసాగుతోంది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ కూడా ప్రారంభం అయింది. అయితే ఫ్లిప్‌ మెంబర్లకు మాత్రమే అందుబాటులోకి రాగా... రేపటి నుంచి అందరూ సేల్‌లో పాల్గొనవచ్చు. అయితే ఈ సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్ల ఫోన్లను డిస్కౌంట్‌ ధరకే కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌ ద్వారా రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు మరియు గ్యాడ్జెట్లను డిస్కౌంట్‌ ధరకు (Realme Smartphones Under Discount 2024) కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో ఇటీవల లాంచ్‌ అయిన రియల్‌మి P1 సిరీస్‌, 12 ప్రో+, నార్జో 70 ప్రో హ్యాండ్‌సెట్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఇయర్‌బడ్స్‌ ను కూడా తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.

realme p1 pro 5g discounts

రియల్‌మి P1 5G సిరీస్‌: ఈ హ్యాండ్‌సెట్ ఇటీవలే భారత్‌లో విడుదల అయింది. రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2400 పిక్సల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే మెరుగైన విజువల్‌ అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.

రియల్‌మి P1 ప్రో 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 5G చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 8GB LPDDR4X ర్యామ్‌, 256GB UFS 3.1 స్టోరేజీ జతచేయబడింది. ప్రత్యేక కూలింగ్ సిస్టమ్‌ ఫోన్‌ను వేడెక్కకుండా పనిచేస్తుంది.

realme p1 pro 5g discounts

P1 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 6GB ర్యామ్‌ +128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీని కలిగి ఉంది. ఈ సేల్‌లో భాగంగా ఈ వేరియంట్లను వరసగా రూ.14,999, రూ.15,999, రూ.16999 కే కొనుగోలు చేయవచ్చు. అదే ప్రో మోడల్‌ 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ వేరియంట్‌లను వరసగా రూ.19,999, రూ.20,999 కే కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి 12 ప్రో+ 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్‌ ద్వారా రూ.3000, కూపన్‌ ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ ధర రూ.24,999, 8GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ ధర రూ.26,999, 12GB ర్యామ్‌ +256GB స్టోరేజీ ధర రూ.30,999 గా ఉంది. రియల్‌మి, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

realme p1 pro 5g discounts

రియల్‌మి 12X 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌ను 6.72 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 950 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. 50MP AI ప్రైమరీ, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్‌ ద్వారా రూ.1000 మరియు రూ.500 డిస్కౌంట్‌ ఆఫర్‌ను పొందవచ్చు. ఫలితంగా 4GB ర్యామ్‌ +128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.10,999, 6GB ర్యామ్ +128GB స్టోరేజీ ధర రూ.11,999, 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ ధర రూ.13,999 కే కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి నార్జో 70 ప్రో 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, 8MP అల్టావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ ను బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.3000 తగ్గింపు, కూపన్‌ ద్వారా రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.17,999, 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.18,999 కే కొనుగోలు చేయవచ్చు.

దీంతోపాటు రియల్‌మి నార్జో 70X 5G, నార్జో 70 5G స్మార్ట్‌ఫోన్లు సహా రియల్‌మి బడ్స్‌ను కూడా డిస్కౌంట్‌ ధరకే కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా రియల్‌మి బడ్స్‌ ఎయిర్‌ 5 పై రూ.700 ధర తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.2999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బడ్స్‌ ఎయిర్‌ ప్రో ను రూ.4199 కే కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme Smartphones get huge discounts in amazon and flipkart 2024 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X