రియల్‌మి ప్రత్యేక సేల్.. P3 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా రూ.4000 డిస్కౌంట్.. రేపటి నుంచే..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ రియల్‌మి కీలక ప్రకటన చేసింది. రియల్‌మి సమ్మర్ సేల్ లో (Realme Summer Sale 2025) భాగంగా ఇటీవల అందుబాటులోకి వచ్చిన P3 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లపై ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించింది. ఈ సిరీస్‌లో P3 ప్రో 5G, P3x 5G, P3 అల్ట్రా 5G, P3 5G వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ సిరీస్ లో గరిష్టంగా రూ.4000 డిస్కౌంట్ ను పొందవచ్చు. రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ realme.com, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్స్ లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటాయి.
* రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్ ను (Realme P3 Ultra 5G) సమ్మర్ సేల్ లో భాగంగా బ్యాంకు కార్డులతో రూ.3000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 9 నుంచి 13 వ తేదీ వరకు ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధరలు 8GB/128GB ధర రూ.26999, 8GB/256GB ధర రూ.27999, 12GB/256GB ధర రూ.29999 గా ఉన్నాయి.

డిస్‌ప్లే :
ఈ ఫోన్ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. గ్లోయింగ్ లూనార్ డిజైన్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. చీకట్లో ఈ ఫోన్ మెరుస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంది.
OS, ఫీచర్‌లు :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS తో పనిచేస్తుంది. 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుందని తెలిపింది. 6050mm2 ఏరోస్పేస్ గ్రేడ్ VC కూలింగ్ సిస్టమ్, AI Motion కంట్రోల్, AI అల్ట్రా టచ్ కంట్రోల్, GT బూస్ట్ గేమింగ్ ఫీచర్లను కలిగి ఉంది.
కెమెరా, బ్యాటరీ వివరాలు :
ఈ ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP సోనీ IMX896 కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. మరియు 80W AI బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. IP66+ IP68+ IP69 రేటింగ్‌తో కూడిన మెరుగైన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
* రియల్‌మి P3 ప్రో 5G :
రియల్‌మి P3 ప్రో 5G ఫోన్‌ను (Realme P3 Pro 5G) ఈ సేల్‌లో భాగంగా రూ.4000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ 8GB/128GB ధర రూ.23999, 8GB/256GB ధర రూ.24999, 12GB/256GB ధర రూ.26999 గా ఉంది.
స్పెషల్ థీమ్ :
ఈ ఫోన్ గ్లో ఇన్ ది డార్క్ డిజైన్ థీమ్‌ను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్‌తోపాటు IP68 + IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.83 అంగుళాల 1.5k క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
చిప్‌సెట్, OS వివరాలు :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS తో పనిచేస్తుంది. AI Best face, AI Motion DeBlur, AI eflection Remover వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా OIS సపోర్టు 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 80W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
* రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ :
రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ ను (Realme P3 5G) ఈ సమ్మర్ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది.
డిస్‌ప్లే :
రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని రియల్‌మి తెలిపింది.
కెమెరా, బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. మరియు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
* రియల్‌మి P3x 5G :
రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్ ను (Realme P3x 5G) ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 గా ఉంది.
ప్రాసెసర్, OS వివరాలు :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS తో పనిచేస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
భారీ బ్యాటరీ :
ఈ ఫోన్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ప్రీమియం వేగాన్ లెదర్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








