Home
Mobile

రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక సేల్‌.. గరిష్ఠంగా రూ.4000 వేల డిస్కౌంట్‌..!

భారత్‌ మార్కెట్‌లో రియల్‌మి ఫోన్‌లను మరోసారి డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి Swipe into Summer క్యాంపెయిన్‌ లో భాగంగా P3 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను గరిష్ఠంగా రూ.4000 డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి P3 సిరీస్‌ ఈ సంవత్సరం లాంచ్‌ అయింది. ఇందులో భాగంగా రియల్‌మి P3, P3 Pro, P3x, P3 అల్ట్రా వేరియంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్‌లను రియల్‌మి వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.

భారత్‌ మార్కెట్‌లో ఈ ప్రత్యేక సేల్‌ మే 20 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 23 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా P3 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను (Realme P3 Series) గరిష్ఠంగా రూ.4 వేల డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఆన్‌లైన్‌ స్టోర్‌లతోపాటు ఆఫ్‌లైన్‌ స్టోర్‌లలోనూ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

realme swipe into summer campaign

రియల్‌మి P3 ప్రో 5G :
రియల్‌మి P3 ప్రో 5G గ్లో ఇన్‌ డార్క్‌ థీమ్‌తో లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ 6.83 అంగుళాల 1.5k క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 OS తో పనిచేస్తుంది. 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 16MP సోనీ IMX480 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 80W ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ సేల్‌లో గరిష్ఠంగా డిస్కౌంట్‌లు, బ్యాంకు ఆఫర్లతో రూ.4000 తగ్గింపును పొందవచ్చు. మరియు 6 నెలల వరకు నో కాస్ట్‌ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20999 గా ఉంది. 12GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉంది.

రియల్‌మి P3 అల్ట్రా 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్ గ్లోయింగ్ లూనార్ డిజైన్‌ను సపోర్టు చేస్తుంది. మరియు 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్‌ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS తో పనిచేస్తుంది.

ఈ ఫోన్‌ OIS సపోర్టుతో 50MP సోనీ IMX896 కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. 80W AI బైపాస్‌ ఛార్జింగ్ టెక్నాలజీతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ సేల్‌లో భాగంగా రూ.2000 ధర తగ్గింపుతో పాటు రూ.1000 కూపన్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.23999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.24999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంటుంది.

రియల్‌మి P3 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 4 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి UI 6.0 తో పనిచేస్తోంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ రియల్‌మి ప్రత్యేక సేల్‌లో భాగంగా P3 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.2 వేలు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.14999, 8GB ర్యామ్ + 128GB ధర రూ.15999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉంటుంది.

రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌ :
ఈ ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 OS ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 45W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh భారీ బ్యాటరీతో పనిచేస్తోంది.

రియల్‌మి P3x 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11999 గా ఉంటుంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 గా ఉంటుంది. ఈ సేల్‌ ఆఫర్లు మే 20 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు వర్తిస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
realme swipe into summer campaign to start from tomorrow in india best deals on realme P3 series
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X