ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
రియల్‌మి సంస్థ భారత్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో ఎంట్రీ లెవల్ మోడళ్లపై ఎక్కువగా దృష్టెపెడుతున్నట్లు తెలుస్తోంది. అందుబాటులో భాగంగా రూ.15000, రూ.12000 కంటే తక్కువ ధర కలిగిన 5G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది. అయితే రియల్‌మి తాజాగా మరో ప్రకటన చేసింది. ధర రూ.10,000 కే రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ ఎంట్రీ లెవల్ ధరలతో రియల్‌మి మెరుగైన స్మార్ట్‌ఫోన్లను (Realme C65 5G Smartphone) అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే ఈ ఫోన్ ఫీచర్ల గురించి సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతోపాటు త్వరలోనే విడుదల చేస్తామన్న ప్రకటన మినహా కచ్చితమైన వివరాలను వెల్లడించలేదు.

అయితే ఇప్పటికే వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం... ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు రెయిన్ వాటర్ టచ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్ 120Hz LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 625 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మరియు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ని కలిగి ఉండే అవకాశం ఉంది.
4GB, 6GB ర్యామ్, 64GB, 128GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు ఈ రియల్‌మి C65 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే రియల్‌మి సంస్థ ఈ ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
దీంతోపాటు రియల్‌మి నుంచి నార్జో 70X 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు సంస్థ అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ ఫోన్‌ను రూ.12000 కంటే తక్కువ ధరకే లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుందని రియల్‌మి అధికారిక X హ్యాండిల్ ద్వారా వెల్లడించింది.
ఇటీవలే రియల్‌మి నుంచి P1 5G సిరీస్ సహా రియల్‌మి నార్జో 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ రెండు కూడా ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లోనే అందుబాటులోకి వచ్చాయి. మరియు మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. P1 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతోపాటు ప్యాడ్ 2, బడ్స్ T110 ను కూడా గత వారం రియల్‌మి లాంచ్ చేసింది.
రియల్‌మి P1 5G సిరీస్‌లో భాగంగా P1 5G, P1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉంది. P1 5G హ్యాండ్‌సెట్ 6.67 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2400 పిక్సల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటాయి. 120Hz రీఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే మెరుగైన విజువల్ అనుభూతిని అందిస్తుందని తెలుస్తోంది.
ఈ రియల్‌మి P1 5G హ్యాండ్‌సెట్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్ 3D VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 4356.52mm స్టెయిన్‌లెస్ వేపర్ ఛాంబర్‌ను కలిగి ఉంది. ఫలితంగా గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయాల్లో హ్యాండ్‌సెట్ వేడెక్కకుండా ఉండేలా ఈ ఫీచర్ పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications