Home
Mobile

రియల్‌మి నుంచి మీరు ఉహించంత భారీ బ్యాటరీ ఫోన్‌.. రేపే ఆవిష్కరణ..!

భారత్‌ మార్కెట్‌ లో ఇటీవల కాలంలో అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లు భారీ బ్యాటరీలతో ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ సంవత్సరం తొలి రోజుల్లో ఐకు సంస్థ 7300mAh బ్యాటరీతో ఐకూ Z10 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ చేసింది. అనంతరం అనేక సంస్థలు 7000mAh లేదా అంతకంటే ఎక్కువ బ్యాటరీతో ఫోన్‌లను విడుదల చేశాయి. ఇటీవల పోకో F7 ఏకంగా 7550mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.

ఎప్పుడు ఆవిష్కరించనున్నారు :
అయితే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ల తయారీ సంస్థ రియల్‌మి ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఏకంగా 15000mAh భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్‌ చేయనున్నట్లు ఇటీవల ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఈ భారీ బ్యాటరీ రియల్‌మి ఫోన్‌ (Realme 15000mAh Battery Smartphone) రేపు (ఆగస్టు 27) న ఆవిష్కరించనున్నట్లు తెలిపింది.

Realme to reveal 15000mAh massive battery smartphone on tomorrow full details

ఏకంగా 5 రోజులపాటు :
రియల్‌మి 15000mAh భారీ బ్యాటరీ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి, గరిష్ఠంగా 18.45 గంటల పాటు వీడియో రికార్డింగ్‌ చేయవచ్చు లేదా 50 గంటల వీడియో ప్లేబ్యాక్‌ టైమ్‌ ను కూడా అందిస్తుంది. అయితే సాధారణ వినియోగంలో ఏకంగా 5 రోజులపాటు ఉపయోగించుకోవచ్చు.

అయితే డిజిటల్ చాట్‌ స్టేషన్ వివరాల ఆధారంగా ప్రస్తుతం ఇంత భారీ బ్యాటరీ ప్రోటోటైప్‌ సిద్ధంగా లేదని, దానికి బదులుగా రియల్‌మి 10000mAh బ్యాటరీ కాన్సెప్ట్‌ ఫోన్‌ పై ఆధారపడొచ్చని తెలిపింది. ఈ ఫోన్ గత సంవత్సరం ప్రదర్శించారు.

ప్రత్యేక కూలింగ్‌ సిస్టమ్‌ :
ప్రస్తుతం రియల్‌మి చెబుతోన్న భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక కూలింగ్‌ సిస్టమ్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఎయిర్‌ కండిషనర్‌ తరహాలోనే ఇన్ బిల్ట్‌ ఫ్యాన్‌ ను కలిగి ఉంటుంది. సింపుల్‌ స్విచ్‌ ద్వారా ఆపరేట్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

ఈ ఇన్‌ బిల్ట్‌ ఫ్యాన్ ద్వారా ఫోన్‌ ఉష్ణోగ్రతను 6 డిగ్రీల సెల్సియస్‌ తగ్గించవచ్చని చెబుతున్నారు. ఈ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ ఇప్పట్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆగస్టు 27 న ఈ ఫోన్‌ను ఆవిష్కరించనుంది. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

* ఈ సంవత్సరం మే నెలలో రియల్‌మి 10000mAh బ్యాటరీతో కాన్సెప్ట్‌ ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ అల్ట్రా హై సిలికాన్‌ యానోడ్‌ బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌ లతో పోలిస్తే మెరుగైన పనితీరును అందిస్తుంది. మరియు 320mAh ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను కలిగి ఉంది.

* గత సంవత్సరం ఆగస్టు నెలలో రియల్‌మి ఈ 320W సూపర్‌ సోనిక్‌ ఛార్జ్‌ టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా 0-100 శాతం ఛార్జింగ్‌ను కేవలం 4 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయవచ్చని నాడు రియల్‌మి తెలిపింది. 26 శాతం ఛార్జింగ్‌ ను 1 నిమిషంలో, అదే 50 శాతం ఛార్జింగ్‌ను రెండు నిమిషాల్లో పూర్తి చేయవచ్చని రియల్‌మి తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme to reveal 15000mAh massive battery smartphone on tomorrow full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X