భారీ డిస్కౌంట్లో రియల్‌మి యు1, అమెజాన్‌లో మాత్రమే
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి ఈ ఏడాది తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Realme U1ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ ఫోన్ మీద పెస్టివ్ ఆఫర్ పేరుతో భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి ఈ ఏడాది తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Realme U1ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ ఫోన్ మీద పెస్టివ్ ఆఫర్ పేరుతో భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ. 1500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 21 నుండి జనవరి 2 వరకు అందుబాటులో ఉంటుంది. కాగా ఈ డిస్కౌంట్ కూడా HDFC డెబిట్, క్రెడిట్ కార్డు మీద ఈఎమ్ఐతో లావాదేవీలు జరిపిన వారికి మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను ఓ సారి పరిశీలిస్తే..

రెండు వేరియంట్లు
కంపెనీ దీన్ని ఈ ఏడాది నవంబర్ లో రిలీజ్ చేసింది. ఇండియా సెల్ఫీ ఫ్రొ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో 3GB RAM + 32GB ROM and 4GB RAM + 64GB ROM విడుదల చేసింది.

రియల్ మి యు1 పూర్తి ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2350 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, డెడికేటెడ్ మొమొరీ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర
బ్రేవ్ బ్లూ, యాంబిషియస్ బ్లాక్ కలర్ వేరియెంట్లలో విడుదలైన రియల్‌మి యు1 ఫోన్ 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.11,999, రూ.14,499 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది. ఇప్పుడు రూ.1500 డిస్కౌంటుతో 10,499కే సొంతం చేసుకోవచ్చు.

కెమెరాలు
రియల్‌మి యు1 ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

అదనపు ప్రయోజనాలు
ఈ ఫోన్‌తోపాటు రూ.499 చెల్లిస్తే ఆకట్టుకునే డిజైనర్ కేస్‌లను అందిస్తారు. ఇక లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై ఎస్‌బీఐ కార్డ్స్‌తో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. జియో తన యూజర్లకు ఈ ఫోన్ ద్వారా 4.2 టీబీ అదనపు డేటాను ఉచితంగా అందిస్తున్నది.


Click it and Unblock the Notifications








