Realme U1 ఫోన్ కొనాలి అనుకుంటున్నారా..అయితే మీకు ఒక గుడ్ న్యూస్
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి గత ఏడాది తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ రియల్‌మి యు1ని లాంచ్ చేసిన చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.1000 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి గత ఏడాది తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ Realme U1ని లాంచ్ చేసిన చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.1000 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.ఇక ఈ ఫోన్‌ను ఇప్పుడు తగ్గింపు ధరకు అమెజాన్, రియల్ మి ఈ-స్టోర్స్‌లలో కొనుగోలు చేయవచ్చు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు.ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను ఓ సారి పరిశీలిస్తే..

ధర
బ్రేవ్ బ్లూ, యాంబిషియస్ బ్లాక్ కలర్ వేరియెంట్లలో విడుదలైన Realme U1 ఫోన్ 3/4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.10,999, రూ.13,499 ధరలకు వినియోగదారులకు లభిస్తున్నది.

అదనపు ప్రయోజనాలు
ఈ ఫోన్ పై నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు.. మొబిక్విక్‌తో రూ.1000 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. జియో ఈ ఫోన్ కొనుగోలుపై వినియోగదారులకు 4.2 టీబీ డేటా వరకు ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది.

రెండు వేరియంట్లు
కంపెనీ దీన్ని గత ఏడాది నవంబర్ లో రిలీజ్ చేసింది. ఇండియా సెల్ఫీ ఫ్రొ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో 3GB RAM + 32GB ROM and 4GB RAM + 64GB ROM విడుదల చేసింది.

కెమెరాలు
Realme U1 ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

Realme U1 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2350 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, డెడికేటెడ్ మొమొరీ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








