Home
Mobile

టెక్ ప్రపంచాన్ని ఊపేస్తున్న లెన్స్ మార్చే ఫోన్.. ఫొటోగ్రఫీలో రియల్‌మీ అల్ట్రా సంచలనం..

Realme Ultra: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2025లో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక కాన్సెప్ట్ ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్ పేరు 'రియల్‌మీ అల్ట్రా’. దీని ప్రత్యేకత ఏంటంటే, దీని కెమెరా లెన్స్‌లను మనం మార్చుకోవచ్చు. సాధారణంగా ఫోన్ కెమెరాలకు లెన్స్‌లు మార్చే సదుపాయం ఉండదు. కానీ రియల్‌మీ మాత్రం సరికొత్తగా ఆలోచించి, రకరకాల లెన్స్‌లు పెట్టుకునే వీలున్న ఫోన్‌ను తయారు చేసింది.

దీనివల్ల ఫొటోలు ఇంకా చాలా బాగా వస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో సోనీ కంపెనీ తయారు చేసిన 1- అంగుళం సెన్సార్ ఉంది. అంతేకాదు, ఇది లైకా ఎం-మౌంట్‌తో వస్తుంది. అంటే.. మంచి క్వాలిటీ కలిగిన డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలకు వాడే లెన్స్‌లను కూడా దీనికి పెట్టుకోవచ్చు.

Realme Unveils    Ultra    Phone Concept with Swappable Camera Lenses at MWC 2025

రియల్‌మీ వాళ్లు ఈ ఫోన్‌ను రెండు లెన్స్‌లతో చూపించారు. అందులో ఒకటి 73mm పోర్ట్రెయిట్ లెన్స్, ఇది దగ్గరి ఫోటోలు బాగా తీయడానికి పనికొస్తుంది. రెండోది 234mm టెలిఫోటో లెన్స్, ఇది దూరంగా ఉన్న వాటిని జూమ్ చేసి తీయడానికి ఉపయోగపడుతుంది. ఫోన్‌లో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి.

* కెమెరాల టెక్నాలజీ

మెయిన్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకా లెన్స్‌లు మార్చుకునేందుకు వీలుగా 1-అంగుళం డైరెక్ట్ లైట్ CMOS సెన్సార్ కూడా ఉంది. ఈ టెక్నాలజీతో డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాల క్వాలిటీతో ఫొటోలు వస్తాయని, జూమ్ బాగా పనిచేస్తుందని, ఫొటోల్లో డెప్త్ బాగుంటుందని రియల్‌మీ అంటోంది. లెన్స్ లేనప్పుడు సెన్సార్‌లో దుమ్ము పడకుండా ఒక గ్లాస్ ప్రొటెక్షన్ కూడా పెట్టారు.

* ఇది కొత్త కాదు కానీ...

లెన్స్‌లు మార్చుకునే ఫోన్లు కొత్తేమీ కాదు. ఇంతకుముందు షియోమీ కంపెనీ 12S అల్ట్రా కాన్సెప్ట్ ఫోన్‌ను, సోనీ కంపెనీ లెన్స్ అటాచ్‌మెంట్లను తీసుకొచ్చాయి. కానీ రియల్‌మీ ఈ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. సొంత 'హైపర్ ఇమేజ్+’ ఇంజన్, అత్యాధునిక ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో మొబైల్ ఫొటోగ్రఫీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది.

ఈ కాన్సెప్ట్ ఫోన్ ద్వారా 10x ఆప్టికల్ జూమ్ క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా వస్తుందని, మామూలు ఫోన్ కెమెరాల కంటే చాలా మంచి ఫొటోలు వస్తాయని రియల్‌మీ చెబుతోంది. రియల్‌మీ అల్ట్రా ఫోన్‌లో రెండు కొత్త AI టూల్స్‌ను కూడా చూపించింది. 'AI వాయిస్-బేస్డ్ రిటచర్’ అనే టూల్ ద్వారా మనం మాటలతోనే ఫొటోలను ఎడిట్ చేయొచ్చు.

* AI టూల్స్ ఎలా పనిచేస్తాయి

ఉదాహరణకు “రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్” లేదా “ఆకాశం నీలంగా మార్చు” అని చెబితే చాలు, ఆటోమేటిక్‌గా ఫొటో ఎడిట్ అయిపోతుంది. 'AI వీడియో ఎరేజర్’ అనే టూల్ ద్వారా వీడియోల్లో మనకు వద్దనుకున్న వస్తువులు లేదా మనుషులను ఒక్క క్లిక్‌తో మాయం చేయొచ్చు. వీడియో ఎడిటింగ్ కూడా చాలా సులువుగా చేసుకోవచ్చన్నమాట.

* ఇది కాన్సెప్ట్ మాత్రమేనా, భవిష్యత్తు ఏంటి?

రియల్‌మీ అల్ట్రా ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్ వాడారు. ఇది 2023లో టాప్ ప్రాసెసర్. అయితే ఇదింకా కాన్సెప్ట్ ఫోన్ మాత్రమే కాబట్టి, ఇది మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. రియల్‌మీ మాత్రం ఈ ఫోన్‌తో మొబైల్ ఫోటోగ్రఫీలో కొత్త టెక్నాలజీలను పరిచయం చేయాలని చూస్తోంది.

మంచి లెన్స్‌లను, AI టెక్నాలజీని కలిపి ఫొటోగ్రఫీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడమే వాళ్ల టార్గెట్. ఈ టెక్నాలజీ సామాన్యులకు అందుబాటులోకి వస్తుందో లేదో చూడాలి. కానీ రియల్‌మీ మాత్రం స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీలో కొత్తగా ఏదో చేయాలని ప్రయత్నిస్తోందని మాత్రం అర్థమవుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme unveiled an 'Ultra' concept phone at MWC 2025 with swappable lenses for DSLR-like photography. It features a 1-inch sensor, Leica M-mount, and AI photo/video editing tools, pushing mobile imaging boundaries.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X