Realme valentines Day sale 2025 రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్ ప్రారంభం.. స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ రియల్‌మి.. వాలెంటైన్స్ డే సందర్భంగా రియల్‌మి వాలెంటైన్స్ డే సేల్ 2025 (Realme valentines Day sale 2025) పేరుతో ప్రత్యేక సేల్‌ను రియల్‌మి ప్రారంభించింది. సేల్ ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనుందని రియల్‌మి తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లతోపాటు స్మార్ట్‌వాచ్, ఎయిర్‌బడ్స్‌ను కూడా డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా రూ.10,000 డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది.
రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ realme.com మరియు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ సహా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చని తెలిపింది. బ్యాంకు ఆఫర్లు, కూపన్ కోడ్స్‌తో డిస్కౌంట్‌లను పొందవచ్చు. దీంతోపాటు EMI ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా రియల్‌మి P1 5G, రియల్‌మి P2 ప్రో 5G, రియల్‌మి GT 6T, రియల్‌మి 13 ప్రో + 5G, రియల్‌మి 14 ప్రో+ 5G, రియల్‌మి 14 ప్రో 5G, రియల్‌మి GT 6, రియల్‌మి GT 7 ప్రో, రియల్‌మి 13+ 5G, రియల్‌మి నార్జో 70 టర్బో 5G, రియల్‌మి నార్జో N65 5G, రియల్‌మి C63 5G స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మి P1 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,000 కూపన్ డిస్కౌంట్‌తో రూ.12,999 కే కొనుగోలు చేయవచ్చు. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. దీంతోపాటు రియల్‌మి GT 6T స్మార్ట్‌ఫోన్‌ను రూ.23,499 కే సొంతం చేసుకోవచ్చు.
రియల్‌మి 13 ప్రో + 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ ప్రారంభ ధర రూ.26999 గా ఉంది. అదే విధంగా రియల్‌మి 14 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999 గా ఉంది.
దీంతోపాటు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB స్టోరేజీ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లనూ ఈ హ్యాండ్‌సెట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే భారత్‌లో విడుదల అయింది. ట్రిపుల్ ఫ్లాష్, కలర్ ఛేంజింగ్ టెక్నాలజీ వంటి ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది.
రియల్‌మి ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ GT 7 Pro మోడల్ 12GB ర్యామ్+ 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.54999 గా ఉంది. అదే 16GB ర్యామ్ వేరియంట్‌ను రూ.59999 కే సొంతం చేసుకోవచ్చు.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.16999 గా ఉంది. అలాగే రియల్‌మి C63 5G స్మా్ర్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.10999 గా ఉంది.
రియల్‌మి నార్జో N65 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.11499 గా ఉంది. అదే 6GB ర్యామ్ మోడల్ ధర రూ.12499 మరియు 8GB ర్యామ్ ధర రూ.13499 గా ఉంది.


Click it and Unblock the Notifications








