ఓపెన్ సేల్స్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ లో Realme X2 సేల్స్

|

రియల్‌మి యొక్క తాజా స్మార్ట్‌ఫోన్ రియల్‌మి X2 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా 24 × 7 ఓపెన్ సేల్‌లో లభిస్తుంది. ఇంతకుముందు ఇ-కామర్స్ వెబ్‌సైట్ కొంతకాలంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఓపెన్ సేల్ లో ఉంచింది. అయితే ఇది శాశ్వతంగా ఉందా లేదా అనే దాని గురించి ప్రత్యేకంగా ఎటువంటి సమాచారం లేదు.

రియల్‌మి ఎక్స్ 2
 

ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క సొంత వెబ్‌సైట్ ద్వారా ఎటువంటి నిరీక్షణ లేకుండా రియల్‌మి ఎక్స్ 2 స్మార్ట్‌ఫోన్ ను 24 × 7 లో ఎప్పుడైనా కొనుగోలు చేయడానికి ఇప్పుడు అందుబాటులో లభిస్తుంది.

గ్లాన్స్ లాక్‌స్క్రీన్: గొప్ప అనుభవంతో న్యూస్ చదవడానికి అద్భుతమైన వేదిక

ప్రాసెసర్

రియల్‌మి సంస్థ గత వారం రియల్‌మి X2 స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి ఫ్లాష్ అమ్మకాన్ని నిర్వహించింది. ఇప్పుడు ఈ ఫోన్ ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. 30W VOOC 4.0 ఫ్లాష్ ఛార్జ్, క్వాల్కమ్ యొక్క గేమింగ్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 730G SOC మరియు 64 మెగాపిక్సెల్ లెన్స్‌తో క్వాడ్-రియర్ కెమెరా సెటప్ ఫీచర్స్ తో రియల్‌మి X2 వస్తుంది. రియల్‌మి X2 ను ఇండియాలో పెర్ల్ బ్లూ, పెర్ల్ గ్రీన్ మరియు పెర్ల్ వైట్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నేటి సూర్యగ్రహణంను ఆన్‌లైన్‌లో లైవ్ గా చూడడం ఎలా?

ధరల వివరాలు

ధరల వివరాలు

రియల్‌మి X2 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో మూడు వేరియంట్లలో లభిస్తుంది.

4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ---- రూ.16,999

6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ---- రూ.18,999

8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ---- రూ.19,999

ఆఫర్స్ వివరాలు
 

ఆఫర్స్ వివరాలు

రియల్‌మి X2 స్మార్ట్‌ఫోన్ కొనుగోలు మీద అందిస్తున్న ఆఫర్ల విషయానికి వస్తే ఫెడరల్ బ్యాంక్ యొక్క డెబిట్ కార్డ్ మీద 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల మీద 5% వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. వీటితో పాటు 11,500 రూపాయల విలువైన రిలయన్స్ జియో ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

ముఖ్యమైన 26 ఛానెల్‌ల ధరలను తగ్గించిన టాటా స్కై

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రియల్‌మి X2 స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల డిస్ప్లే FHD + (2,340 x 1,080 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో సూపర్ AMOLED ప్యానల్‌తో వస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC చేత 2.2GHz వద్ద అడ్రినో 618 GPU తో క్లాక్ చేయబడి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ రకాల (4GB, 6GB, 8GB) RAM మరియు 64GB, 128GB స్టోరేజ్ లతో వస్తుంది. కనెక్టివిటీ విషయంలో రియల్‌మి వై-ఫై, హాట్‌స్పాట్, బ్లూటూత్ వి 5.0, ఎఫ్‌ఎం రేడియో మరియు జిపిఎస్‌లను కూడా జోడించింది.

సెన్సార్‌

అదనంగా ఇది యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, లైట్, మాగ్నెటిక్ ఇండక్షన్ మరియు సామీప్య సెన్సార్‌తో పాటు USB టైప్-సి పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. రియల్‌మి ఎక్స్‌ 2 ఆండ్రాయిడ్ 9 ఆధారిత కలర్‌ఓఎస్ 6.1 తో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత అప్‌డేట్‌కు అనువుగా ఉన్నట్లు కంపెనీ ధృవీకరించింది.

ఆన్‌లైన్‌ సేల్స్ కోసం ఇండియాలో ఇ-స్టోర్ ను ప్రారంభించిన ACER

కెమెరా

రియల్‌మి X2 స్మార్ట్‌ఫోన్ 64 మెగాపిక్సెల్ మెయిన్ శామ్‌సంగ్ GW1 సెన్సార్‌తో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మిగిలిన వాటిలో అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, సూపర్ మాక్రో సెన్సార్‌తో 2 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఇందులో 32 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ముందు భాగంలో సెల్ఫీ కెమెరా ఉంది. ఇది VOOC ఫ్లాష్ ఛార్జ్ 4.0 కు మద్దతుతో 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme X2 Open Sales Live on Flipkart and Realme.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X