రియల్‌మి X50 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి

|

రియల్‌మి సంస్థ తన నుండి రాబోయే స్మార్ట్‌ఫోన్‌ల యొక్క ముఖ్యమైన విషయాలను నిరంతరం సోషల్ మీడియాలో టీజ్ చేస్తూఉంటుంది. ఇప్పుడు సంస్థ నుండి వస్తున్న రియల్‌మి X50 5G స్మార్ట్‌ఫోన్‌ను సోషల్ మీడియాలో నిరంతరం టీజ్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ దగ్గరగా వస్తున్నందున చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఇప్పుడు మరొక కొత్త టీజర్ పోస్టర్‌ను విడుదల చేశారు.

టీజర్
 

కొత్తగా విడుదల చేసిన టీజర్ పోస్టర్‌లో ఈసారి ఫోన్ యొక్క ముందు భాగంను టీస్ చేసారు. ఇంతకుముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు ఈ రెండర్ కటౌట్ ఎక్కడ ఉంచబడుతుందో చూపిస్తుంది. అదనంగా ఫోన్లో కొంచెం మందంగా ఉన్న చిన్ మరియు బేర్-మినిమమ్ సైడ్ బెజెల్స్‌ను కూడా గుర్తించవచ్చు.

చంద్రయాన్ -3 మిషన్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

డ్యూయల్ హోల్-పంచ్ డిస్ప్లే

రియల్‌మి కొత్తగా రిలీజ్ చేసిన టీజర్‌లో మొదటిసారి రియల్‌మి X50 5G యొక్క ముందు భాగాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఈ ఫోన్ ఉహించిన విధంగా స్క్రీన్ యొక్క ఎడమవైపు ఎగువ-మూలలో రెండు సెల్ఫీ కెమెరాల కటౌట్‌లతో నాచ్-లెస్ డ్యూయల్ హోల్-పంచ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు కెమెరాలు ఒకదానికొకటి పక్కన ఉంచబడి పిల్ ఆకారపు మాడ్యూల్‌ను కలిగి ఉంటాయి.

రేపటి నుంచి వాట్సాప్ ఈ ఫోన్లలో పనిచేయదు

టీజర్

వాల్యూమ్ యొక్క రాకర్స్ డిస్ప్లే యొక్క ఎడమవైపు అంచున కనిపిస్తాయి. అయితే అక్కడ పవర్ బటన్ కనిపించడం లేదు. అంటే ఇది స్క్రీన్ యొక్క కుడివైపు అంచున ఉంచబడినట్లు సూచిస్తుంది. డిస్ప్లే చుట్టూ బెజెల్స్‌ తక్కువగా ఉంటాయి మరియు దిగువన కొంచెం చిన్ ఉంది. ఫోన్ అంచులలో నీలిరంగు ముగింపుని కనబరుస్తుంది. ఇంతకుముందు విడుదలైన టీజర్ లో పోలార్ కలర్ ఆప్షన్‌తో పాటు బ్లూ గ్రేడియంట్ ఆప్షన్ కూడా ప్రారంభించబడుతుందని సూచిస్తుంది.

అందుబాటులోకి శామ్సంగ్ గెలాక్సీ A30s స్మార్ట్‌ఫోన్‌ 128GB స్టోరేజ్ వేరియంట్‌

రియల్‌మి X50 5G
 

రియల్‌మి X50 5G స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 7 న చైనాలో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ గతంలో అనేక రెండర్‌లలో టీజ్ చేసింది. ఇది క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 765G SoC చేత రన్ అవుతున్నట్లు నిర్ధారించబడింది. అలాగే ఇది VOOC 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ యొక్క మెరుగైన సంస్కరణకు మద్దతు ఇస్తుంది.

స్పెసిఫికేషన్ల

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్ప్లే, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు మరియు 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ ఫోన్ మూడు (ర్యామ్ + స్టోరేజ్) ఆప్షన్లలో వస్తున్నట్లు సమాచారం. ఇందులో టాప్-ఎండ్ మోడల్ 8 జిబి ర్యామ్ + 256 జిబి మోడల్. దీని ధర CNY 2,799 (సుమారు రూ.28,000) వద్ద ఉన్నట్లు సమాచారం.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme X50 5G Smartphone Teaser Realised: Check Features,Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X