Realme X50 Pro 5G,iQOO 3 5G: ఇండియా మొదటి 5G ఫోన్ల సేల్స్ & ఆఫర్స్...
ఇండియాలో ప్రస్తుతం 5G హ్యాండ్‌సెట్ స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయినాయి. ఇండియా యొక్క మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌గా పిలవబడే రియల్‌మి X50 ప్రో 5G నిన్న రిలీజ్ కాగా నేడు మరొక ఫోన్ iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసారు. మునుపెన్నడూ లేని విధంగా రియల్‌మి X50 ప్రో 5Gను లాంచ్ చేసిన వెంటనే దీనిని కేవలం ఒక రోజుకు మాత్రమే అమ్మకానికి ఉంచారు.

సేల్స్ వివరాలు
ఇండియాలో రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క రెండవ సేల్స్ మార్చి 5 న జరుగుతుందని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ధృవీకరించింది. రియల్‌మి యొక్క కొత్త 5G ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, రియల్.కామ్ ద్వారా మార్చి 5 న మధ్యాహ్నం 12:00 గంటలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. iQOO3 5G స్మార్ట్‌ఫోన్ యొక్క సేల్స్ కూడా మార్చి 4 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో మొదలుకానున్నాయి.

సేల్స్ ఆఫర్స్
రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క కొనుగోలు ఆఫర్ల విషయానికొస్తే కొనుగోలుదారులు రిలయన్స్ జియో యొక్క రూ.11,500 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ క్రెడిట్ కార్డుల మీద నో-కాస్ట్ EMI ఎంపిక కూడా లభిస్తుంది. ఈ సేల్స్ ఆఫర్స్ రియల్‌మిX50 ప్రో, రియల్‌మి X2, రియల్‌మి X2 ప్రో, రియల్‌మి XT మరియు రియల్‌మిX ఫోన్ లకు కూడా వర్తిస్తుంది.

దరల వివరాలు
ఇండియాలో రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క దరల విషయానికి ఇది మూడు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో 6GB ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ .37,999 గా నిర్ణయించబడింది. అలాగే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.39,999 మరియు 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధరను రూ.44,999 గా నిర్ణయించబడింది. ఇది రస్ట్ రెడ్ మరియు మోస్ గ్రీన్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

iQOO3 5G స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో మూడు మోడళ్లలో రెండు 5G మరియు ఒకటి 4G వేరియంట్ లలో అందిస్తోంది. iQOO3 యొక్క 5G 12 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.44,990 నిర్ణయించబడింది. ఇదే స్టోరేజ్ గల 4G వేరియంట్ యొక్క ధర రూ.36,990గా నిర్ణయించబడింది. వినియోగదారులు 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ యొక్క 5G మోడల్ ను రూ.36,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ యొక్క 4G వేరియంట్ యొక్క ధర రూ .39,990గా నిర్ణయించబడింది. iQOO3 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో మార్చి 4 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్స్ లో భాగంగా ఐసిఐసిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై రూ.3,000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

రియల్‌మి X50 ప్రో 5G స్పెసిఫికేషన్స్
రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC చేత రన్ అవుతుంది. భారతదేశంలో ఈ 5G మొబైల్ ప్లాట్‌ఫాంలో విడుదల అవుతున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. దీని ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ దాని ముందు కంటే CPU మరియు GPU పనితీరులో పెద్ద మెరుగుదలను తెస్తుంది. ఇది 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 180HZ శాంప్లింగ్ రేట్‌తో 6.44-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ యొక్క ముందు భాగంలో డ్యూయల్ అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరాల కోసం పిల్ ఆకారపు కటౌట్ కూడా ఉంది.

కెమెరా సెటప్
రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది 92 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉండడమే కాకుండా ఇది ప్యానెల్ FHD + రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీలను క్లిక్ చేయడానికి ముందుభాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో జోడించబడి ఉండడమే కాకుండా ఇది 65W సూపర్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతునిస్తుంది. ఇది సూపర్ లీనియర్ డ్యూయల్ స్పీకర్‌తో వస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ GW1 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-అంగెల్ కెమెరా మరియు 12 మెగాపిక్సెల్ కెమెరా టెలిఫోటో సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ పోట్రైట్ సెన్సార్ తో కూడిన కెమెరాలను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ 20x హైబ్రిడ్ జూమ్‌తో పాటు వై-ఫై 6 కి మద్దతు ఇస్తుంది.

కనెక్టివిటీ
రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-మోడ్ 5G, డ్యూయల్ 4G, VoLTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5.0, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 55 మోడెమ్ ఉంది. ఇది యూజర్లు 5G మరియు 4G నెట్‌వర్క్‌ల మధ్య సులభంగా మారడానికి అనుమతిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 10 మరియు కలర్‌ఓఎస్ ఆధారిత రియల్‌మి UI 1.0 తో రన్ అవుతుంది.

iQOO3 5G స్పెసిఫికేషన్స్
iQOO3 5G స్మార్ట్‌ఫోన్ రియల్‌మి X50 ప్రో మాదిరిగానే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 12GB వరకు LPDDR5 RAM తో మరియు 256GB వరకు గల UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్ ఆధునిక పంచ్-హోల్ HD + AMOLED డిస్ప్లే 6.44-అంగుళాలతో వస్తుంది. ప్రైవసీ కోసం డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండడమే కాకుండా ఫేస్ అన్‌లాక్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇది డ్యూయల్ సిమ్‌లకు మద్దతు ఇస్తుంది మరియు ఆండ్రాయిడ్10- ఆధారిత iQOO UI 1.0తో రన్ అవుతుంది. IQOO 3 6.44-అంగుళాల FHD + సూపర్ AMOLED స్క్రీన్‌తో HDR + మద్దతుతో మరియు 91.40% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. పరికరం పోలార్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది. iQOO3 5G స్మార్ట్‌ఫోన్ కార్బన్ ఫైబర్ pc లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఇది వాల్కనో ఆరెంజ్, క్వాంటం సిల్వర్ మరియు బ్లాక్ అనే మూడు కలర్ లలో లభిస్తుంది.

iQOO 3 5G కెమెరా సెటప్
iQOO 3 5G హ్యాండ్‌సెట్ యొక్క వెనుక భాగంలో క్వాడ్-రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 48 మెగాపిక్సెల్ సెన్సార్ తో మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. 48MP (సోనీ IMX582, f / 1.79), 13MP టెలిఫోటో (f / 2.46), 13MP వైడ్ యాంగిల్ (f / 2.2) మరియు 2MP డెప్త్ సెన్సార్ తో (f / 2.4) లెన్స్ లను కలిగి ఉంటాయి. వీడియో కాలింగ్ మరియు సెల్ఫీల కోసం ముందు భాగంలో పంచ్-హోల్ డిస్ప్లేలో 16MP షూటర్ ఉంది. హ్యాండ్‌సెట్ 1x, 5x మరియు 20x జూమ్‌లకు మద్దతు ఇస్తుంది. అల్ట్రావైడ్, డెప్త్ మరియు టెలిఫోటో కోసం ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి. iQOO 3 హ్యాండ్‌సెట్ 55W iQOO ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో 4,440mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 5G కి మద్దతు ఇస్తుంది మరియు అన్ని ఇతర బ్యాండ్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications