Realme X50 Pro 5G: మరో 6 రోజులలో Feb24న ఇండియాలో ప్రారంభం

|

ఇండియా యొక్క మార్కెట్ లోకి ఒప్పో యొక్క సబ్-బ్రాండ్ గా ప్రవేశించిన రియల్‌మి సంస్థ ఇప్పుడు భారత మార్కెట్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని దక్కించుకున్నది. సరసమైన ధర గల ఫోన్లు, మిడ్-రేంజ్ ధరల ఫోన్లు మరియు దాని ఇతర ఆఫర్‌ల కారణంగా రియల్‌మి భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి బ్రాండ్‌గా రియల్‌మి మారబోతున్నది.

రియల్‌మి X50 ప్రో 5G

రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో తన గ్లోబల్ లాంచ్ ఈవెంట్ ఫిబ్రవరి 24 రోజున లాంచ్ చేయబోతున్నట్లు రియల్‌మి మెయిలర్లను పంపింది. బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) కార్యక్రమంలో ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయాలని కంపెనీ ఇంతకుముందు ప్లాన్ చేసింది.

 

 

Redmi 8A Dual సేల్స్ నేటి నుంచే... ఆఫర్స్ అదుర్స్...Redmi 8A Dual సేల్స్ నేటి నుంచే... ఆఫర్స్ అదుర్స్...

ఈవెంట్

కరోనావైరస్ యొక్క భయాల వల్ల ఈవెంట్ ను రద్దు చేసిన తర్వాత కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్ కోసం ఆన్‌లైన్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రియల్‌మి అభిమానుల కోసం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. రియల్‌మి X50 ప్రో 5G ఫోన్‌ను ‘ఇండియా యొక్క తొలి 5G స్మార్ట్‌ఫోన్‌' అని టీజ్ చేసారు.

 

Free Wi-Fi సర్వీస్ రైల్వే స్టేషన్లలో : గూగుల్‌ అవుట్... రైల్‌టెల్ ఇన్...Free Wi-Fi సర్వీస్ రైల్వే స్టేషన్లలో : గూగుల్‌ అవుట్... రైల్‌టెల్ ఇన్...

 

 

లాంచ్ డేట్ వివరాలు
 

లాంచ్ డేట్ వివరాలు

రియల్‌మి ఇండియా యొక్క అధికారిక ట్విట్టర్ పేజీలో ఈ ప్రయోగానికి సంబందించి కొన్ని నిమిషాల వీడియోను ట్వీట్ చేసింది. రియల్‌మి ఇండియా నుండి వచ్చిన ట్వీట్ లోని సారాంశం "మా అత్యంత ప్రతిష్టాత్మక ఫ్లాగ్‌షిప్ అయిన # రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్‌ను కనుగొనడానికి సిద్ధంగా ఉండండి! ఇండియా యొక్క మొదటి 5G స్మార్ట్‌ఫోన్ # realmeX50Pro 5G యొక్క ఈవెంట్ లాంచ్ ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. న్యూ డిల్లీలో జరిగే లాంచ్ ఈవెంట్‌కు అభిమానులను ఆహ్వానిస్తున్నాము. మీరు ఉత్సాహంగా ఉంటే ఈవెంట్‌కు రావచ్చు." రియల్‌మి ఇండియా ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ట్వీట్‌కు ముందు బ్రాండ్ యొక్క యూరోపియన్ బ్రాంచ్ కూడా ఇలాంటిదే ట్వీట్ చేసింది. రియల్‌మి యూరప్ కూడా ఫిబ్రవరి 24, 2020 న రియల్‌మి X50 ప్రో 5Gని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

 

 

WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?

iQOO 3 5G

iQOO 3 5G

రియల్‌మి X50 ప్రో 5G ని రియల్‌మి సంస్థ ప్రారంభించిన ఒక రోజు తరువాత వివో యొక్క సబ్ బ్రాండ్ iQOO3 కూడా ఫిబ్రవరి 25 న ఇండియాలో లాంచ్ చేయబోతున్నది. iQOO3 ఇండియాలో లాంచ్ అవుతున్న రెండవ 5G స్మార్ట్‌ఫోన్ అవుతుంది. కానీ రియల్‌మి ఎక్స్‌ 50 ప్రో 5G మాత్రం ఇండియాలోని మొదటి 5G ఫోన్‌గా ఉంటుందని తెలుస్తోంది.

 

 

Postpaid Add-On కనెక్షన్ మీద రూ.50 పెంచిన ఎయిర్‌టెల్Postpaid Add-On కనెక్షన్ మీద రూ.50 పెంచిన ఎయిర్‌టెల్

రియల్‌మి X50 ప్రో 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మి X50 ప్రో 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మి X50 ప్రో 5G బ్రాండ్ ఇప్పటికే మంచి హైప్‌ను కలిగి ఉన్నది. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ మరియు ఫీచర్స్ ఇప్పటికే కొన్ని లీక్ అయినాయి. లీక్ అయిన వాటి ప్రకారం రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 865 SoC తో వస్తున్నట్లు సమాచారం. అలాగే ఇది 65W సూపర్‌డార్ట్ ఛార్జ్ టెక్నాలజీతో రాబోతున్నది. ఇది కాకుండా రియల్‌మి X50 ప్రో 5G స్క్రీన్ యొక్క ఎడమ వైపున డ్యూయల్-పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఒప్పో యొక్క VOOC ఛార్జీకి సమానంగా ఉన్నట్లు సమాచారం. ఇది 65W మద్దతుతో కేవలం 30 నిమిషాల్లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని మొత్తాన్ని ఛార్జ్ చేయగలదని చెబుతోంది. రియల్‌మి X50 ప్రో 5G ఫోన్ 12 జిబి ర్యామ్‌ + 256 జిబి స్టోరేజ్‌ మోడల్‌తో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Best Mobiles in India

English summary
Realme X50 Pro 5G Launch Date Confirmed for February 24

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X