Realme X50 Pro 5G రిలీజ్... సేల్స్ ఆఫర్స్ బ్రహ్మాండం...

|

ఇండియా యొక్క మొదటి 5G స్మార్ట్‌ఫోన్ అని కూడా పిలువబడే రియల్‌మి X50 ప్రోను ఇప్పుడు ఇండియాలో ఈ రోజు లాంచ్ చేసారు. రాబోయే మరొక18 నెలల్లో టెలికాం ఆపరేటర్లు అందరు కూడా ఇండియాలో తమ 5G నెట్‌వర్క్‌ను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే 5G స్మార్ట్‌ఫోన్‌లలో రియల్‌మి X50 ప్రో 5G మొదటిది కావడం విశేషం.

రియల్‌మి X50 ప్రో
 

రియల్‌మి X50 ప్రోలో 5G హైప్‌ను పక్కన పెడితే ఈ స్మార్ట్‌ఫోన్ గొప్ప స్పెసిఫికేషన్స్ లను కలిగి ఉంది. ఇది రియల్‌మి X2 ప్రో యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్ గా ఉండడమే కాకుండా ఇది స్నాప్‌డ్రాగన్ 865 SoC తో వస్తున్న మొట్టమొదటి హ్యాండ్‌సెట్‌గా నిలిచింది. 90 హెర్ట్జ్ స్క్రీన్, 32MP డ్యూయల్ పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా, వెనుకవైపు 64MP క్వాడ్-కెమెరా సెటప్, 12GB వరకు LPDDR5 ర్యామ్ మరియు 65W సూపర్ డార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4200mAh బ్యాటరీని కలిగి ఉండడం మరింత ఆసక్తికరమైన విషయం. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్... రూ.99, రూ.199లకే గూగుల్ నెస్ట్ మినీ, నెస్ట్ హబ్‌

దరల వివరాలు

దరల వివరాలు

ఇండియాలో రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క దరల విషయానికి ఇది మూడు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో 6GB ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ .37,999 గా నిర్ణయించబడింది. అలాగే 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.39,999 మరియు 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధరను రూ.44,999 గా నిర్ణయించబడింది.

Nokia 9 PureView స్మార్ట్ ఫోన్ మీద భారీ ధర తగ్గింపు...

సేల్స్ వివరాలు

సేల్స్ వివరాలు

రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క మొదటి సేల్స్ ఈ రోజు అంటే ఫిబ్రవరి 24, 2020 సాయంత్రం 6 గంటలకు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క వెబ్ సైట్ ద్వారా జరుగుతుంది. వన్‌ప్లస్ 8 సిరీస్ లాంచ్ తేదీ ఇంకా అధికారికంగా ధృవీకరించబడనందున రియల్‌మి X50 ప్రోకు ఇప్పుడు మార్కెట్ లో ఎటువంటి పోటీ లేదు. ఇది రస్ట్ రెడ్ మరియు మోస్ గ్రీన్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

స్పెసిఫికేషన్స్
 

స్పెసిఫికేషన్స్

రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC చేత రన్ అవుతుంది. భారతదేశంలో ఈ 5G మొబైల్ ప్లాట్‌ఫాంలో విడుదల అవుతున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. దీని ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ దాని ముందు కంటే CPU మరియు GPU పనితీరులో పెద్ద మెరుగుదలను తెస్తుంది. ఇది 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 180HZ శాంప్లింగ్ రేట్‌తో 6.44-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ యొక్క ముందు భాగంలో డ్యూయల్ అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరాల కోసం పిల్ ఆకారపు కటౌట్ కూడా ఉంది.

Reliance Jio Rs.2,121 Annual Plan:వార్షిక ప్లాన్‌లలో జియోదే అగ్రస్థానం

డిస్ప్లే

డిస్ప్లే

రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది 92 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉండడమే కాకుండా ఇది ప్యానెల్ FHD + రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీలను క్లిక్ చేయడానికి ముందుభాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో జోడించబడి ఉండడమే కాకుండా ఇది 65W సూపర్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతునిస్తుంది. ఇది సూపర్ లీనియర్ డ్యూయల్ స్పీకర్‌తో వస్తుంది.

Microsoft Office All-in-One App: ఇప్పుడు మొబైల్ ఫోన్లలో

రియర్ కెమెరా సెటప్‌

రియర్ కెమెరా సెటప్‌

ఫోటోలు మరియు వీడియోల కోసం రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ GW1 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-అంగెల్ కెమెరా మరియు 12 మెగాపిక్సెల్ కెమెరా టెలిఫోటో సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ పోట్రైట్ సెన్సార్ తో కూడిన కెమెరాలను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ 20x హైబ్రిడ్ జూమ్‌తో పాటు వై-ఫై 6 కి మద్దతు ఇస్తుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ

రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-మోడ్ 5G, డ్యూయల్ 4G, VoLTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5.0, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 55 మోడెమ్ ఉంది. ఇది యూజర్లు 5G మరియు 4G నెట్‌వర్క్‌ల మధ్య సులభంగా మారడానికి అనుమతిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 10 మరియు కలర్‌ఓఎస్ ఆధారిత రియల్‌మి UI 1.0 తో రన్ అవుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme X50 Pro 5G Smartphone Launched in India: Price,Specs,Features,Sales Date,Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X