అసలెందుకు లైక్ చెయ్యాలి..?

Posted By: Staff

అసలెందుకు లైక్ చెయ్యాలి..?

 

అనేకమైన పుకార్లు.. ఊహాగానాల అనంతరం మే3న లండన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 స్మార్డ్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. ఏ ఇతర స్మార్ట్‌ఫోన్‌లోలేని ఫీచర్లను సరికొత్త గెలాక్సీ ఎస్3 ఒదిగి ఉంది. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన ప్రతీ ఫీచర్ యూజర్‌కు ఉపయోగపడేదిగా ఉంటుంది. గెలాక్సీ ఎస్3ని ఎంచుకోడానికి గల ఉత్తమ పది కారణాలను తెలుసుకుందాం:

1. పెద్దదైన డిస్ ప్లే:

గెలాక్సీ ఎస్3, 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 720పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ద్వారా యూజర్ ఉత్తమమైన విజువల్ అదేవిధంగా గ్రాఫిక్ అనుభూతులను ఆస్వాదించగలుగుతాడు.

2. డైరెక్ట్ కాల్:

గెలాక్సీ ఎస్3లో ఒదిగి ఉన్న మరో ఫీచర్ ‘డైరెక్ట్ కాల్’.ఈ ఫీచర్ సౌలభ్యతతో ఏ విధమైన బటన్లను ప్రెస్ చెయ్యకుండా కాలింగ్ నిర్వహించుకోవచ్చు. ఉదాహరణకు మీకు సందేశం పంపిన వ్యక్తితో వెంటనే మాట్లాడాలనుకున్నారు. అందుకు ఫోన్‌ను ఓ సారి చెవి లేదా ముఖానికి చూపిస్తే ఆటోమెటిక్‌గా సదరు వ్యక్తి నంబరుకు కాల్ వెళ్లి పోతుంది.

3. ఐ ట్రాకింగ్:

ఎస్‌3లో నిక్షిప్తం చేసిన మరో అప్లికేష్ ఐ ట్రాకింగ్. ఈ ఫీచర్ విశిష్టతను పరిశీలిస్తే, యూజర్ ఫోన్ వైపు చూస్తున్నంత సేపు ఫోన్ స్ర్కీన్ ఆన్‌లోనే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఫ్రంట్ కెమెరా ద్వారా యూజర్ చూస్తున్నారా, లేద అన్నది పరిశీలించి తరువాతి చర్యకు ఉపక్రమిస్తుంది.

4. ఎస్ వాయిస్:

ఎస్ వాయిస్ అప్లికేషన్ వాయిస్ కమాండ్ ఆధారితంగా పనిచేస్తుంది. సిరి అప్లికేషన్ తరహాలో రూపొందించబడిన ఈ అప్లికేషన్ మాటలకు అనుగుణంగా స్పందిస్తుంది. ఈ ఫీచర్ సౌలభ్యతతో అనేకమైన కమ్యూనికేషన్ అవసరాలను సెకన్ల వ్యవధిలో తీర్చుకోవచ్చు.

5. ఆల్ షేర్ కాస్ట్:

ఆల్ షేర్ క్యాస్ట్ సౌలభ్యతతో హ్యాండ్‌సెట్‌ను పెద్ద స్ర్కీన్‌లకు జత చేసుకుని కంటెంట్‌ను వై-ఫై సౌలభ్యతతో స్ట్రీమ్ చేసుకోవచ్చు.

6. ఎస్ బీమ్:

హ్యాండ్ సెట్‌లో నిక్షిప్తం చేసిన మరో  అప్లికేషన్ ఎస్ బీమ్ సాయంతో ఒకే మోడల్ కలిగిన రెండు ఫోన్‌ల నంచి మరొక ఫోన్‌కు ఫైళ్లను 10 నుంచి 15 ఎంబీ వేగంతో ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.

In English

7. స్మార్ట్ విడి భాగాలు:

గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్ కోసం సామ్‌సంగ్ అనేక విడిభాగాలను లాంచ్ చేసింది. ఈ జాబితాను ఓ సారి పరిశీలిస్తే.. ఆల్ కాస్ట్ డాంగిల్, వైర్‌లెస్ ఛార్జింగ్ కిట్, ఎస్ పెబ్బిల్ ఎంపీత్రీ ప్లేయర్, బ్యాటరీ ఛార్జింగ్ స్టాండ్, ఫ్లిప్ కవర్‌లు ఉన్నాయి.

8. 4జీ ఎల్‌టీఈ సపోర్ట్:

గెలాక్సీ ఎస్3 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. దింతో నెట్ బ్రౌజింగ్ వేగం రెట్టింపవుతుంది. ప్రస్తుతానికి 4జీ ఎల్ టీఈ నెట్ వర్క్ సేవలు యూఎష్,  యూకెలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 3జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 4జీ నెట్‌వర్క్ వేగం 10 రెట్టు అధికంగా ఉంటుంది.

9. ఉత్తమమైన కెమెరా:

గెలాక్సీ ఎస్3లో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ కెమెరా అత్యుత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ఈ కెమెరా వేగం సెకనుకు 8 షాట్స్, మీ మధరుస్మృతులను హై క్వాలిటీతో బంధించి కలకాలం పదిలపరుస్తుంది.

10. 64 జీబి  స్టోరేజ్:

గెలాక్సీ ఎస్3.. 16,32,64జీబి మెమెరీ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. ప్రస్తుతానికి 16, 32 వేరియంట్‌లు మాత్రమే లభ్యం కానున్నాయి. త్వరలో 64జీబిని ప్రవేశపెట్టనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot