బూతు చూస్తే బుక్కైపోతారు జాగ్రత్త..?

మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షించే ముందు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలు..

|

మొబైల్ డేటా మరింతగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌లలో పోర్న్ సైట్‌లను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షంచటం భారత్‌లో చట్టవిరుద్ధం కానప్పటకి టెక్నికల్‌గా కొన్ని అంశాల రూపంలో పెద్ద ముప్పే పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్‌లలో పోర్న్ కంటెంట్‌ను వీక్షించే ముందు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయాలు..

Read More : గెలాక్సీ ఎస్7కు షాకిచ్చిన నోకియా 3310 కెమెరా

చట్టవిరుద్ధం...

చట్టవిరుద్ధం...

చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించటం చట్టవిరుద్ధం. మొబైల్ ఫోన్ లలో చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించినట్లు రుజువులు దొరికేతే తప్పనిసరిగా అటువంటి వ్యక్తులు కఠినమైన లీగల్ సమస్యలను ఫేస్ చేయవల్సి ఉంటుంది.

ఆ యాప్స్‌ ఇన్‌స్టాల్ అంతే సంగతులు..

ఆ యాప్స్‌ ఇన్‌స్టాల్ అంతే సంగతులు..

చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు అవగాహన రాహిత్యంతో పోర్స్ యాప్స్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకుంటుంటారు. ఈ చర్యతో వాళ్ల స్మార్ట్‌ఫోన్ చిక్కుల్లో పడినట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర సాఫ్ట్‌వేర్ వైరస్‌లు వీరి ఫోన్‌లలోకి ప్రవేశించి లోపలి డేటాను చిన్నాభిన్నం చేసేస్తాయట.

 చాట్, ఎస్ఎంఎస్, ప్రీమీయమ్ ఎస్ఎంఎస్ రూపంలో వెంటాడుతనే ఉంటాయి.

చాట్, ఎస్ఎంఎస్, ప్రీమీయమ్ ఎస్ఎంఎస్ రూపంలో వెంటాడుతనే ఉంటాయి.

అడల్ట్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తోన్న వెబ్‌సైట్ ప్రొవైడర్స్ తన సైట్‌లను సందర్శించే మొబైల్ ఫోన్ యూజర్లకు చాట్, ఎస్ఎంఎస్, ప్రీమీయమ్ ఎస్ఎంఎస్, వాప్, లోకేషన్ వంటి సర్వీసులను ఎరవేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఒక్కోసారి యూజర్‌కు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివేట్ కాబడతాయని, దింతో యూజర్ ఫోన్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్లేనని సైబర్ నిపుణులు చెబుతన్నారు.

వైరస్ ముప్పు

వైరస్ ముప్పు

పోర్న్ వెబ్‌‌సైట్‌లలో వైరస్‌ను జొప్పించే లింక్స్ తప్పనిసరిగా ఉంటాయి. అటువంటి లింక్స్ పై క్లిక్ చేయటం ద్వారా యూజర్కు తెలియకుండానే వైరస్ అతని డివైస్‌లోకి ప్రవేశించి వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును కూడా దొంగిలించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‌

రాన్సమ్‌వేర్ ముప్పు..

రాన్సమ్‌వేర్ ముప్పు..

రాన్సమ్‌వేర్ స్మార్ట్‌ఫోన్‌లలో తరచూ మీరు పోర్న్ సైట్‌లను వీక్షిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్‌కు రాన్సమ్‌వేర్ ముప్పు పొంచి ఉన్నట్లే. యూజర్ ఓ పోర్న్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన వెంటనే ఓ పాపప్ లాంటిది ఓపెన్ అయి వెంటనే స్మార్ట్‌ఫోన్ ను పూర్తిగా లాక్ చేసేస్తుంది.   ఆ లాక్‌ను ఓపెన్ చేయాలంటే కొత్త మొత్తంలో డబ్బను చెల్లించాలంటూ హ్యాకర్లు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ డబ్బు చెల్లించినప్పటికి మీ ఫోన్ యాదాస్థితికి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థతి. కాబట్టి, స్మార్ట్‌ఫోన్‌‌లలో పోర్న్ కంటెంట్ వీక్షించే ముందు ఈ విషయాన్ని గుర్తంచుకోండి.

Best Mobiles in India

English summary
Reasons why you should not watch X-rated videos on Android smartphones. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X