ఫోన్ రూటింగ్.. పెద్ద రిస్క్!
ఫోన్‌ను రూటింగ్ చేయటం వలన ఆపరేటింగ్ సిస్టంను మార్చేయవచ్చు. ఈ క్రమంలో బోలెడన్ని సవాళ్లను ఎదుర్కోవల్సి ఉంటుంది.
ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా రెండు అకౌంట్‌లు ఉంటాయి. వాటిలో ఒకటి అడ్మినిస్ట్రేటర్‌ది అయితే మరొకటి గెస్ట్ అకౌంట్. ఫోన్ తయారీదారుడు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌ను లాక్ చేసి గెస్ట్ అకౌంట్‌ను మాత్రమే యూజర్‌కు అందుబాటులో ఉంచుతాడు.

Read More : ఫ్రీ వై-ఫైతో నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారా..?
అంటే మనం గెస్ట్ అకౌంట్‌ను మాత్రమే వినియోగించుకోగలం. ఇక్కడ రూటింగ్ అంటే ఫోన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌లోకి ప్రవేశించటమే. ఫోన్‌ను రూటింగ్ చేయటం వలన ఆపరేటింగ్ సిస్టంను మార్చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌ను రూట్ చేసే మందు తెలుసుకోవల్సిన ముఖ్యమైన విషయాలు..

ముందుగానే ఓ అవగాహన
రూట్ చేయటం వల్ల ఉపయోగమేంటి..? రూట్ చేస్తున్నప్పుడు ఎటువంటి సమస్యలు ఎదరువుతాయ్..? వంటి విషయాల గురించి మీకు ముందుగానే ఓ అవగాహన ఉండాలి.

ఫోన్ పనితీరు మందగిస్తుంది..
పలు సందర్భాల్లో రూటింగ్ పూర్తి అయిన తరువాత ఫోన్ పనితీరు చాలా మందగిస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫోన్ డస్ట్‌బ్యాగ్‌లా తయారయ్యే ప్రమాదముంది.
లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరు జెన్యున్ యూజర్ కారు..
ఫోన్‌ను రూట్ చేయటం వల్ల ఆండ్రాయిడ్ మిమ్మల్ని జెన్యున్ యూజర్‌గా గుర్తించదన్న విషయాన్ని తెలుసుకోవాలి.

స్పైవేర్లు చుట్టుముట్టే ప్రమాదం..
పలు సందర్భాల్లో రూటంగ్ చేయటం వల్ల ఫోన్ ఒరిజినల్ లాంగ్వేజ్ మారిపోయే ప్రమాదముంది. రూట్ కాబడిన మీ ఫోన్‌ను స్పైవేర్లు అలానే యాడ్‌వేర్లు సులువుగా చుట్టుముట్టే ప్రమాదము లేకపోలేదు.

వాస్తవికత దెబ్బతింటుంది..
రూట్ కాబడిన అన్ని ఆండ్రాయిడ్ డివైస్‌లలో వాస్తవికత (genuineness) ఇంకా పనితీరు దెబ్బతినే అవకాశముంది.

వర్షన్‌ను బట్టి రూటింగ్ పద్ధతి..
ఫోన్ మోడల్ అలానే ఆండ్రాయిడ్ వర్షన్‌ను బట్టి రూటింగ్ పద్ధతి ఉంటంది. కాబట్టి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు సెట్ అయ్యే రూటింగ్ పద్ధతి మాత్రమే ఎంపిక చేసుకోండి. అలానే మీ ఫోన్ మోడల్‌కు సంబంధించిన నెంబర్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వర్షన్, బిల్డ్ నెంబర్ వంటి వివరాలను భద్రపరచుకోండి. ఈ వివరాలను ఫోన్ సెట్టింగ్స్‌లోని అబౌట్ ఫోన్ (About phone) మెనూలో ఉంటాయి

నకిలీ కస్టమ్ ROMలను..
పలువురు క్రియేటర్లు తమ ప్రయోజనాల కోసం నకిలీ కస్టమ్ ROMలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండండి.

డేటా మొత్తం తొలగిపోయే ప్రమాదం
ఫోన్ రూటింగ్ సమయంలో చిన్న పొరపాటు జరిగినా డివైస్‌లోని డేటా మొత్తం తొలగిపోయే ప్రమాదముంది. కాబట్టి రూటింగ్ కు ముందే ఫోన్ లోని డేటాను బ్యాకప్ చేసుకోండి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications