ప్రపంచంలోనే తొలి హోలోగ్రాఫిక్ డిస్‌ప్లే ఫోన్ 'హైడ్రోజన్ వన్'

హై ఎండ్ కెమెరాలను తయారు చేసే రెడ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే.

|

హై ఎండ్ కెమెరాలను తయారు చేసే రెడ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే . అందులో భాగంగానే ఇప్పుడు హైడ్రోజన్ వన్ పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే మొదటి హోలోగ్రాఫిక్ డిస్‌ప్లే కలిగిన ఫోన్ కావడం విశేషం. ఈ డిస్‌ప్లేలో కనిపించే దృశ్యాలు 3డీ అనుభూతిని ఇస్తాయి. అయితే అందుకు 3డీ గ్లాసెస్‌ను ధరించాల్సిన పనిలేదు. రెడ్ హైడ్రోజన్ వన్ ఫోన్‌కు చెందిన అల్యూమినియం వేరియెంట్ ధర రూ.87,550 ఉండగా, టైటానియం వేరియెంట్ ధర రూ.1,16,770 గా ఉంది. అయితే ఈ ఫోన్ ఏయే దేశాల మార్కెట్లలో అందుబాటులోకి వస్తుందో రెడ్ కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఎయిర్టెల్ కొత్త ఆఫర్ : 2000 రూపాయల వరకు కాష్ బ్యాక్ఎయిర్టెల్ కొత్త ఆఫర్ : 2000 రూపాయల వరకు కాష్ బ్యాక్

ఫీచర్లు...

ఫీచర్లు...

5.7 ఇంచ్ క్వాడ్‌హెచ్‌డీ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ.

హోలోగ్రాఫిక్ 4 వ్యూ (హెచ్4వి) రికార్డింగ్ ఫీచర్‌....

హోలోగ్రాఫిక్ 4 వ్యూ (హెచ్4వి) రికార్డింగ్ ఫీచర్‌....

ఈ ఫోన్‌లో 5.7 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ వన్ ఫోన్‌లో హోలోగ్రాఫిక్ 4 వ్యూ (హెచ్4వి) రికార్డింగ్ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల 3డీ క్వాలిటీ ఉన్న వీడియోలను కెమెరా ద్వారా షూట్ చేసుకోవచ్చు. అలాగే 3డీ ఫొటోలను కూడా తీసుకోవచ్చు.

హోలో పిక్స్ అనే యాప్‌....

హోలో పిక్స్ అనే యాప్‌....

ఇక ఈ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రాం తరహాలో హోలో పిక్స్ అనే యాప్‌ను అందిస్తున్నారు. దీని సహాయంతో 3డీ ఫొటోలను షేర్ చేసుకోవచ్చు.

ఫేస్ టైం తరహాలో ఈ ఫోన్‌లో ఓ వీడియో కాలింగ్ యాప్‌ను....

ఫేస్ టైం తరహాలో ఈ ఫోన్‌లో ఓ వీడియో కాలింగ్ యాప్‌ను....

అలాగే ఆపిల్ ఐఫోన్లలో ఉండే ఫేస్ టైం తరహాలో ఈ ఫోన్‌లో ఓ వీడియో కాలింగ్ యాప్‌ను ఇందులో త్వరలో అందివ్వనున్నారు.

ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి....

ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి....

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి హైడ్రోజన్ నెట్‌వర్క్ ద్వారా పెయిడ్ మూవీలు, వీడియోలను ఉచితంగా వీక్షించే సదుపాయం అందిస్తున్నారు. అదేవిధంగా ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు.

 

 

Best Mobiles in India

English summary
RED Hydrogen One specifications and features: Everything you need to know.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X