బ‌డ్జెట్ ధ‌రలో Redmi 10A Sport మొబైల్ విడుద‌ల.. ఫీచ‌ర్ల‌పై లుక్కేయండి!

|

చైనాకు చెందిన ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Xiaomi, భార‌త్‌లో త‌మ మార్కెట్ ను క్ర‌మంగా విస్త‌రిస్తోంది. తాజాగా ఆ కంపెనీ నుంచి మ‌రో కొత్త బ‌డ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. Redmi 10A Sport పేరుతో బ‌డ్జెట్ మొబైల్‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. భార‌త్‌లో గ‌త ఏప్రిల్‌లో విడుద‌లైన Redmi 10A వేరియంట్ కంటే ఈ కొత్త మోడ‌ల్ అత్య‌ధిక ర్యామ్ కెపాసిటీ క‌లిగి ఉంది. అదేవిధంగా Redmi 10A వేరియంట్‌తో పోలిస్తే ఈ కొత్త మోడ‌ల్ ప‌లు అప్‌గ్రేడ్ ఫీచ‌ర్ల‌తో త‌యారైంది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ ప్ర‌త్యేక‌త‌ల‌పై ఓ లుక్కేద్దాం.

 
బ‌డ్జెట్ ధ‌రలో Redmi 10A Sport మొబైల్ విడుద‌ల.. ఫీచ‌ర్ల‌పై లుక్కేయండి!

గ‌త వేరియంట్‌తో పోలిస్తే Redmi 10A Sport ర్యామ్ కెపాసిటీ ఎక్కువ‌:
భార‌త్‌లో గ‌త ఏప్రిల్‌లో విడుద‌లైన Redmi 10A వేరియంట్ కంటే ఈ కొత్త మోడ‌ల్ అత్య‌ధిక ర్యామ్ కెపాసిటీ క‌లిగి ఉంది. Redmi 10A వేరియంట్ 4GB RAM తో విడుద‌లైంది. కానీ, ఈ కొత్త స్పోర్ట్ మోడ‌ల్‌కు అధికంగా 6GB RAM కెపాసిటీ క‌ల్పిస్తున్నారు. ఇక డిజైన్ విష‌యానికొస్తే సేమ్ పాత మోడ‌ల్ మాదిరిగానే ఉంటుంది. దీనికి స్క్రీన్‌పై వాట‌ర్ డ్రాప్ నాచ్ ఇస్తున్నారు. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. లార్జ్ కెమెరా మాడ్యూల్ అందిస్తున్నారు. ప‌వ‌ర్ బ‌ట‌న్‌, వాల్యూమ్ బ‌ట‌న్స్ కుడి వైపు ఇస్తున్నారు.

Redmi 10A Sport ఫీచ‌ర్లు స్పెసిఫికేష‌న్ల‌ను ఓ సారి ప‌రిశీలిద్దాం:
ఈ మొబైల్ కు 6.53 అంగుళాల full-HD + TFT IPS (1,600 x 720 pixels) రిసొల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 12.5 ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ octa-core MediaTek Helio G25 ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది.

బ‌డ్జెట్ ధ‌రలో Redmi 10A Sport మొబైల్ విడుద‌ల.. ఫీచ‌ర్ల‌పై లుక్కేయండి!

ఈ మొబైల్ 6GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్కు 13 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 5 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 10W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, కొత్త Redmi 10A Sporవేరియంట్ డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, Wi-Fi, బ్లూటూత్ 5.0, A-GPS, 3.5mm హెడ్‌ఫోన్ సాకెట్‌ను క‌లిగి ఉంది.

Redmi 10A Sport ధ‌ర‌లు:
ఈ కొత్త వేరియంట్ Redmi 10A Sport ధ‌ర విష‌యానికి వ‌స్తే.. 8GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీ మొబైల్ ధ‌ర రూ.10,999 గా నిర్ణ‌యించారు. ఇది చార్‌కోల్ బ్లాక్‌, సీ బ్లూ, స్లేట్ గ్రే క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉంటుంది.
ఈ రోజు నుండి Mi.com మరియు Amazon Indiaలో హ్యాండ్‌సెట్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

బ‌డ్జెట్ ధ‌రలో Redmi 10A Sport మొబైల్ విడుద‌ల.. ఫీచ‌ర్ల‌పై లుక్కేయండి!

రెడ్‌మీ కంపెనీ ఇప్ప‌టికే ఈ నెల‌లో మ‌రో స్మార్ట్ ఫోన్ ను కూడా విడుద‌ల చేసింది. భార‌త్‌లో K Series మొబైల్స్‌ను తిరిగి ప్రారంభిస్తూ.. Redmi K50i స్మార్ట్‌ఫోన్ మోడ‌ల్‌ను భార‌త మార్కెట్లో ఈ నెల ఆరంభంలో విడుద‌ల చేసింది.
Redmi K50i ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD + (1,080x2,460 pixels) LCD డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ octa-core MediaTek Dimensity 8100 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ IP53 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ స‌హ‌కారంతో ప‌నిచేస్తుంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. 6GB RAM + 128GB | 8GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ల‌లో ల‌భిస్తోంది.

 

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన కెమెరా 64 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో Samsung ISOCELL GW1 లెన్స్ క‌లిగి ఉంది. మ‌రో రెండు కెమెరాలు 8 మెగాపిక్సెల్‌(అల్ట్రా వైడ్ లెన్స్‌), 2 మెగాపిక్సెల్ క్వాలిటీ (మాక్రో లెన్స్‌)ని క‌లిగి ఉన్నాయి. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5080 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.3 ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది.

భార‌త మార్కెట్లో ఈ మొబైల్ ధ‌ర‌లు:
భార‌త మార్కెట్లో Redmi K50i బేస్ వేరియంట్ 6GB RAM + 128GB ధ‌ర రూ.25,999 గా నిర్ణ‌యించారు. మ‌రో వేరియంట్ 8GB RAM + 256GB ధ‌ర రూ.28,999 గా నిర్ణ‌యించారు. ఈ మొబైల్ క్విక్ సిల్వ‌ర్‌, ఫాంటం బ్లూ, స్టెల్త్ బ్లాక్ క‌ల‌ర్ల‌లో ఇది అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Redmi 10A Sport With 6GB RAM Launched As A Higher RAM Variant; Price & Specs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X