50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్..!
రెడ్‌మి నుంచి గత సంవత్సరం ఆగస్టులో రెడ్‌మి 12 5G స్మార్ట్ ఫోన్ (Redmi 12 5G Smartphone) విడుదల అయింది. ప్రస్తుతం ఈ హ్యాండ్ సెట్ బేస్ వేరియంట్ ను తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. Mi.com మరియు ప్రముఖ ఈ -కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
రెడ్‌మి 12 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు..
రెడ్‌మి 12 5G స్మార్ట్‌ఫోన్ 6.79 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz రీఫ్రెష్ రేట్, 550 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 మరియు స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అదే విధంగా సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం రెడ్‌మి 12 5G స్మార్ట్‌ఫోన్ 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ IP53 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వచ్చింది.
ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. జడే బ్లాక్, మూన్‌స్టోన్ సిల్వర్, పాస్టల్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేసేందుకు రెడ్‌మి 12 5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.

రెడ్‌మి 12 5G స్మార్ట్ ఫోన్ ధర..
రెడ్‌మి 12 5G స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్ లో రూ.11,999 గా ఉంది. మరియు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.750 వరకు తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అదే అమెజాన్ వినియోగదారులు బ్యాంకు ఆఫర్ల ద్వారా గరిష్ఠంగా రూ.1000 వరకు తగ్గింపును పొందవచ్చు. SBI, ICICI, HDFC బ్యాంకు కార్డుల ద్వారా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. Mi.com లో కొనుగోలు చేస్తే రూ.1250 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు ఎంఐ ఫోన్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.1000 డిస్కౌంట్ ను పొందవచ్చు.

గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








