Home
Mobile

108MP కెమెరా, 6.79 అంగుళాల డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..?

రెడ్‌మి నుంచి మరో స్మార్ట్‌ఫోన్‌ త్వరలో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. రెడ్‌మి 13 4G స్మార్ట్‌ఫోన్‌ (Redmi 13 4G Smartphone) గురించి సంస్థ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. విడుదల తేదీపైనా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ రెడ్‌మి 13 4G స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి 12 4G హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌ గా లాంచ్‌ కానుందని సమాచారం.

అయితే ఈ రెడ్‌మి 13 4G స్మార్ట్‌ఫోన్‌ గురించి ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు లీక్‌ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు మీడియాటెక్‌ హీలియో G91 అల్ట్రా SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

Redmi 13 4G smartphone expected to launch in india

రెడ్‌మి 13 4G స్మార్ట్‌ఫోన్‌ అంచనా స్పెసిఫికేషన్‌లు :
రెడ్‌మి 13 4G స్మార్ట్‌ఫోన్‌ 6.79 అంగుళాల పుల్‌ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ బ్లాక్‌, బ్లూ, పింక్‌ మరియు ఎల్లో రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుందని సమాచారం. మరియు మీడియాటెక్‌ హీలియో G91 అల్ట్రా SoC మరియు Mali G52 MC2 GPU పైన పనిచేస్తుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్‌ గరిష్ఠంగా 8GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రధానంగా కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు వెనుకవైపు వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. 108MP ప్రైమరీ, 2MP కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 13MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు LED ఫ్లాష్‌ యూనిట్‌ తో విడుదల అయ్యే అవకాశం ఉంది.

91మొబైల్స్‌ నివేదిక ఆధారంగా రెడ్‌మి 13 4G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌ మరియు 128GB అంతర్గత స్టోరేజీ ధర EUR 199 (భారత కరెన్సీ ప్రకారం రూ.16,500) గా ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు 8GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర EUR 229 (భారత కరెన్సీ ప్రకారం రూ.19,000) గా ఉండనుందని సమాచారం.

ఈ హ్యాండ్‌సెట్ ఫ్లాట్‌ డిస్‌ప్లే సహా పంచ్‌ హోల్ డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు కుడివైపు పవర్ మరియు వాల్యూమ్‌ బటన్లను కలిగి ఉంటుంది. ఫోన్‌ కింది భాగాన USB-C ఛార్జింగ్‌ పోర్టు, స్పీకర్లు, మైక్‌ను కలిగి ఉంటుంది. మరియు ఎడమవైపు సిమ్‌ కార్డు ట్రే తో వస్తుంది.

33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5030mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP53 రేటింగ్‌తో వాటర్‌, డస్ట్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి రానుంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.0 మరియు డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై కనెక్టివిటీతో లాంచ్‌ కానుంది. మరియు సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్‌లపై రెడ్‌మి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Redmi 13 4G smartphone key specification leaked in india full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X